ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్లో ‘అదుర్స్’ (Adhurs) సినిమా చాలా స్పెషల్. ఈ సినిమాలో చేసిన చారి పాత్ర అతని కెరీర్లోనే ‘ది బెస్ట్’ అని చెప్పొచ్చు. సినిమా సీరియస్ గా వెళ్తున్న టైంలో కూడా ఆ పాత్ర చేసే కామెడీకి జనాలు పడి పడి నవ్వారు. ఎన్టీఆర్లోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసిన సినిమాగా కూడా ‘అదుర్స్’ని చెప్పుకోవాలి. అయితే కామెడీ పండించడం అనేది చిన్న విషయం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఆడియన్స్ విమర్శలు కురిపిస్తారు.
Kona Venkat
కానీ ఆ సినిమాలో చారి పాత్రకి ఎన్టీఆర్ చాలా బ్యాలెన్స్డ్ గా నటించాడు. ‘ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎలా ప్రిపేర్ అయ్యాడో’.. ఆ సినిమాకి రైటర్ గా చేసినటువంటి కోన వెంకట్ (Kona Venkat) ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. కోన వెంకట్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ ‘అదుర్స్’ టైంలో నన్ను ఇంటికి పిలిపించుకుని ఆ స్లాంగ్ మాట్లాడించుకుని ‘వాడు ఏమంటాడు చెప్పు కోన’ అంటూ పడి పడి నవ్వి, నన్ను అడిగి.. ‘చేప చేతిలో ఉంటే చిరాగ్గా ఉంటుంది కానీ..
నోట్లో ఉంటే దివ్యంగా ఉంటుందిరా’ వంటి డైలాగ్స్ ని, ముఖ్యంగా ఆ స్లాంగ్ ని పదే పదే మాట్లాడించుకుని, తను సింక్ చేసుకుని చేసిన సినిమా ‘అదుర్స్’. అంటే ఒక యాక్టర్,ఒక డైరెక్టర్, ఒక రైటర్.. వీళ్ళు ముగ్గురూ పర్ఫెక్ట్ సింక్ లో ఉంటే.. అప్పుడు ఆ కామెడీ పండుతుంది. అది ఎక్కువ కాలం గుర్తుంటుంది” ఎన్టీఆర్ చేసిన హోం వర్క్ గురించి గొప్పగా వివరించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :