దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ వల్ల సౌత్ సినిమా స్థాయి బాలీవుడ్ ను డామినేట్ చేసే విధంగా అభివృద్ధి చెందింది. ‘బాహుబలి'(సిరీస్) ‘ఆర్.ఆర్.ఆర్’, ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ లతో ప్రశాంత్ నీల్ ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా చాలా తెలుగు సినిమాలు బాలీవుడ్లో రిలీజ్ అయ్యి మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. అంతేకాకుండా సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్లో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్, రాజమౌళి మాత్రం తమ నేటివ్ లాంగ్వేజ్ లో తీసిన సినిమాలతోనే రికార్డులు కొట్టారు. అయితే వీళ్ళకి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ఉందా అంటే కచ్చితంగా అవును, కాదు, అని చెప్పడం లేదు. ఇది పక్కన పెట్టేస్తే.. బాలీవుడ్లో క్రేజ్ ను సంపాదించుకుని.. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అంటే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్న స్టార్లు కొంతమంది ఉన్నారు. ఈ 7 మంది స్టార్లు బాలీవుడ్ ఎంట్రీ పై పలు సందర్భాల్లో చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి. ఆ సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1) మహేష్ బాబు :
‘బాలీవుడ్ నుండీ నాకు చాలా సార్లు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ బాలీవుడ్ నన్ను భరించలేదు. నాకు తెలుగు సినిమానే కంఫర్ట్ గా అనిపిస్తుంది. తెలుగు సినిమా బాలీవుడ్ జనాలకి కూడా రీచ్ అవ్వాలి అనేది నా ఉద్దేశం’ అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి.
2) ప్రియమణి :
‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులని ఇంప్రెస్ చేసిన ప్రియమణి బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అంటే? “ఒకప్పుడు శ్రీదేవి, రేఖ, హేమమాలిని, వైజయంతి మాల వంటి వారు బాలీవుడ్ ను శాసించారు. వాళ్ళ తర్వాత అలా చెప్పుకోడానికి ఎవరూ లేరు. సౌత్ నటీనటులను – నార్త్ లో ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. ఒకప్పుడు మన సౌత్ టెక్నీషియన్లను వాళ్ళు వాడుకుని హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి కానీ మన వాళ్లకి క్రెడిట్ ఇచ్సిన సందర్భాలు లేవు.అయితే ఎట్టకేలకు సౌత్ టాలెంట్‌కి బాలీవుడ్‌లో కూడా గుర్తింపు దక్కుతుండడం సంతోషంగా ఉంది..! బాలీవుడ్ ఎంట్రీ అనేది మనం డిసైడ్ చేసుకోకూడదు మనకి వచ్చే స్క్రిప్ట్ లు, పాత్రలు డిసైడ్ చేయాలి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
3) శృతీ హాసన్ :
బాలీవుడ్ ఎంట్రీ పై కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్ మాట్లాడుతూ.. “బాలీవుడ్లో సినిమాలు చేసినా అక్కడి జనాలు సౌత్ జనాలు అంటే వేరే విధంగా ట్రీట్ చేస్తుంటారు. నేను 3 తెలుగు సినిమాలు, 3 తమిళ్ సినిమాలు చేశాను అనుకోండి బాలీవుడ్ జనాలు హిందీ పరిశ్రమ పై ఫోకస్ చేయడం లేదా అని అడుగుతారు. అక్కడికి బాలీవుడ్ ఒక్కడే సినీ పరిశ్రమనా? కాబట్టి అక్కడి వాళ్ళ దగ్గర నేను ఔట్ సైడర్ లానే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది.
4) యష్ :
‘కె.జి.ఎఫ్’ హీరో యష్ బాలీవుడ్ గురించి మాట్లాడుతూ.. “మన సినిమాలకు ఒకప్పుడు ఇలాంటి ఆదరణ బాలీవుడ్లో లభించేది కాదు. నార్త్ లో ఏమి జరుగుతుందో మనకి తెలిసేది కాదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే మనవాళ్ళు డబ్బింగ్ వెర్షన్లను విడుదల చేయడం మొదలుపెట్టారో, అప్పుడు మన పై వాళ్ళ ఫోకస్ పడింది. మనం కథ చెప్పే విధానం ఎంత బాగుంటే అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు.నిజానికి ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్నదే.. కానీ ఇన్నాళ్టికి వాళ్ళు మన సినిమాలను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టారు” అంటూ చెప్పుకొచ్చాడు.’అలాగే బాలీవుడ్లో ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వాల్సిన పని లేదు. అంత టైం పెట్టాల్సిన అవసరం లేదు. కంటెంట్ బాగుంటే వాళ్ళే ఎక్కువ రిసీవ్ చేసుకుంటారు’ అని కూడా చెప్పుకొచ్చాడు.
5) ధనుష్ :
బాలీవుడ్ గురించి ధనుష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సౌత్, నార్త్ అని ప్రత్యేకించి విభజించాల్సిన పని లేదు. ఇక్కడ రూపొందేవి ఇండియన్ సినిమాలు. అక్కడ సినిమాలు చేసినా, ఇక్కడ సినిమాలు చేసిన నటీనటులు కష్టపడాల్సిందే. అప్పుడే మార్పు వేగంగా వస్తుంది. బాలీవుడ్ కు మన సౌత్ ఏమాత్రం తీసిపోదు. కానీ కొన్ని మార్పులు జరగాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బాలీవుడ్లో కూడా సినిమాలు చేస్తున్నాడు ధనుష్.
6) అల్లు అర్జున్ :
‘నాకు బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి కానీ అది నాకు ఎక్కువ జోష్ ఇచ్చిన విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనం చేసే సినిమాల్లో హీరోలుగా చేస్తున్నప్పుడు ఇంకో భాషలో విలన్ గా చేయమనడం లేదా సెకండ్ హీరోగా చేయమనం సమంజసం కాదు. ఇష్టమైన వాళ్ళు చేస్తారు అందులో తప్పు లేదు. కానీ మార్కెట్ ను కాదని పక్క భాషల్లో సినిమా చేయడం రిస్కే. అందుకు ధైర్యం, తెగింపు కూడా కావాలి’ అంటూ బన్నీ అన్నాడు. అంటే బాలీవుడ్లో ఇతనికి సెకండ్ హీరో ఆఫర్ వచ్చిందన్న మాట. అయితే ‘పుష్ప’ మనోడు అక్కడ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు.
7) రాంచరణ్ :
చరణ్ ఆల్రెడీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘జంజీర్’ తో ఒకసారి, ‘ఆర్.ఆర్.ఆర్’ తో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇతను మాట్లాడుతూ.. “నేను బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తాను. కాకపోతే సౌత్లో కూడా ఆకట్టుకునే సినిమా తీసే దర్శకుడు కావాలి అని కోరుకుంటున్నాను. ‘రామ్, రాజమౌళి, తారక్‌ల పనితనం నాకు చాలా ఇష్టం, అయితే సౌత్‌లో మన సినిమాలు ఎందుకు ఆదరణ పొందడం లేదు’ అని సల్మాన్ ఓసారి ట్వీట్ చేశాడు. అతను అలా అనడం చాలా నిష్కపటంగా అనిపించింది. అది పూర్తిగా రైటింగ్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది.దానిని బౌండరీలు దాటించాల్సింది దర్శకుడు. విజయేంద్ర ప్రసాద్,రాజమౌళి వంటి వారు ఉంటే బాలీవుడ్లో పని చేస్తాను. వారిలా అన్ని భాషల్లో కలిసొచ్చే సినిమాని తీయగలగాలి” అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.
8) ప్రభాస్ :
గతంలో ప్రభాస్(ఏక్ నిరంజన్ టైం లో) బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఇంకా ఏమీ సాధించలేదు. అక్కడికెళ్లి ఏం చేస్తాను’ అంటూ నవ్వుతు అన్నాడు.
9) నాని :
నేచురల్ స్టార్ నాని.. బాలీవుడ్ నిర్మాతలతో ఓ సినిమా చేశాడు. అయితే బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ‘అది పూర్తిగా కథ పై అలాగే దానిని హ్యాండిల్ చేయగల దర్శకుడు పై ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
10) ఎన్టీఆర్ :
‘స్టార్ డం వచ్చింది కదా అని లార్జ్ స్కేల్ సినిమాలు చేయలేము. బాలీవుడ్ జనాలకి మన పై గౌరవం ఏర్పడింది. కాబట్టి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఎక్కువ పడింది. నేను అక్కడికి వెళ్లి ఆ గౌరవాన్ని పోగొట్టాలి అని అనుకోవడం లేదు’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.