డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు హీరో అభినవ్ సర్దార్. ఇటీవలే ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన ‘రామ్ అసుర్’ సినిమాలో సూరి పాత్ర పోషించి తన విలక్షణ నటనతో అలరించిన ఆయన.. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుంచి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. హీరోగా చేస్తూనే నిర్మాతగా కూడా సక్సెస్‌ఫుల్ సినిమాల రూపకల్పనలో భాగమవుతున్న అభినవ్ సర్దార్.. ఇప్పుడు ‘మిస్టేక్’ అనే మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ASP మీడియా ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్. 2గా రాబోతున్న ఈ సినిమాకు సన్నీ కోమలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అభినవ్ సర్దార్ హీరోగా నటిస్తూనే నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఈ విలక్షణ కథను ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అడ్వెంచర్ కాన్సెప్ట్‌కి నేటితరం కోరుకునే విధంగా రొమాంటిక్ యాంగిల్ యాడ్ చేసి సస్పెన్స్, అడ్వెంచరస్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘మిస్టేక్’ అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు చిత్ర ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న దర్శకనిర్మాతలు.. ఎప్పటికప్పుడు చిత్ర అప్‌డేట్స్ వదులుతూ సినిమా పట్ల ఆసక్తి పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే రీసెంట్‌గా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ‘గంటా గ్రహచారం’ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. మంగ్లీ, రోల్ రైడా గాత్రం ఈ పాటలో మేజర్ అట్రాక్షన్ కాగా.. మణి జెన్నా కట్టిన బాణీలు, శ్రీ శిరాగ్, రోల్ రైడా అందించిన లిరిక్స్ హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఈ సాంగ్ భారీ వ్యూస్ రాబడుతూ దూసుకుపోతోంది. ఇదే జోష్‌లో మిస్టేక్ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేయగా ఈ పాటకు కూడా హ్యుజ్ రెస్పాన్స్ దక్కుతోంది.
గుంటూరులోని VVIT కళాశాలలో సుమారు 4వేల మంది విద్యార్ధుల నడుమ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. చిత్రబృందంతో పాటు సింగర్ రేవంత్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ”పిల్లా.. పిల్లా.. ఈ నిమిషం నిను చూస్తా ఉంటే ఏందో ఆశే కలిగిందే.. ఈడే వేధించే ఆ తీయని బాధ తీసేస్తా.. కసిగా నీ ఒడిలో నెలవంకే దాచేస్తా..” అంటూ రొమాంటిక్ డోస్ దట్టిస్తూ షూట్ చేసిన ఈ సాంగ్ యూత్ ఆడియన్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. జంగిల్ థీమ్, సింగర్ రేవంత్ గానం, మణి జెన్నా మ్యూజిక్‌తో పాటు యువతకు కిక్కిచ్చేలా ఈ పాటలో కొన్ని సీన్స్ హైలైట్స్‌గా నిలిచాయి. శ్రీరామ్ పిసుపాటి అందించిన లిరిక్స్ పాటకు మేజర్ అసెట్ అయ్యాయి. ఈ పాట కోసం సుమారు 40మంది లిల్లీపుట్స్‌ను సేకరించడం విశేషం. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
ఈ మిస్టేక్ చిత్రంలో అభినవ్ సర్దార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన లుక్, మ్యానరిజం చాలా డిఫరెంట్‌గా ఉండనున్నాయి. ఈ సినిమాతో అభినవ్ మరో మెట్టు ఎక్కనున్నారని చిత్రయూనిట్ అంటోంది. చిత్రంలో సుజిత్ కుమార్, అజయ్ కతుర్వార్, తేజా అయినంపూడి, కరిష్మా కుమార్, తాన్యా, ప్రియ లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనుంది చిత్రయూనిట్.