అఖిల్ (Akhil Akkineni) హీరోగా.. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ నందు అలియాస్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుంది. అఖిల్ కెరీర్లో 6వ ప్రాజెక్టుగా మొదలైన ఈ సినిమాకి ‘లెనిన్’ (Lenin) అనే పేరును ఖరారు చేస్తూ ఓ గ్లింప్స్ వదిలారు. ‘మనం ఎంటర్టైన్మెంట్’ తో కలిసి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్లో రూపొందే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. కానీ పక్కా మాస్ మూవీ అన్నట్టు టీజర్ ను కట్ చేశారు.
దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ కి ఈసారి కచ్చితంగా పెద్ద హిట్ పడుతుంది అనే హోప్ ఇచ్చింది. శ్రీలీల (Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. విడుదల చేసిన ఒక్క గ్లింప్స్ కే సినిమా బిజినెస్ మొదలైపోయింది అని టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘లెనిన్’ సినిమాకి అప్పుడే రూ.40 కోట్ల వరకు నాన్ థియేట్రికల్ ఆఫర్ వచ్చాయని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ప్రాజెక్టుని తీసుకోవడానికి రెడీ అయ్యింది.
అలాగే ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ వంటి వాటికి కూడా మంచి డిమాండ్ ఏర్పడిందట. వీటన్నిటి రూపంలో ఈ సినిమా రూ.40 కోట్ల వరకు రికవరీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక ఈ సినిమాకు రూ.60 కోట్ల వరకు బడ్జెట్ పెట్టబోతున్నట్లు టాక్. సో సగానికి సగం విడుదలకి ముందే రికవరీ అంటే చిన్న విషయం కాదు. అయితే వచ్చిన ఆఫర్ కి నిర్మాతలు ఇంకా ఓకే చెప్పలేదు అని వినికిడి.