నాని (Nani) వరుస హిట్లకి బ్రేక్ వేసిన సినిమా ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించింది. 2022 జూన్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాగానే ఉంటుంది. కానీ జనాలు థియేటర్లకు రాకపోవడం వల్ల కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ సినిమా రన్ టైం ఏకంగా 3 గంటలు ఉండటం వల్లే అనేది ఎక్కువ మంది చేసిన కంప్లైంట్.
సినిమా ఒక పద్దతిగా వెళ్తున్న టైంలో చైల్డ్ హుడ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ వస్తూ పోతూ ఉంటాయి. పైగా నాని చైల్డ్ హుడ్ ఎపిసోడ్ కూడా 20 నిమిషాల వరకు ఉంటుంది. ఇవన్నీ ఆడియన్స్ కి బోర్ కొట్టేశాయి. కొన్ని రివ్యూల్లో ఈ సినిమాకి రాసిన నెగిటివ్ పాయింట్స్ లో ఎక్కువగా ఈ విషయాన్నే ప్రస్తావించారు. దీంతో రన్ టైం విషయంలో నాని ఓ గొప్ప పాఠం నేర్చుకున్నట్టు కనిపిస్తుంది.
‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమా రన్ టైం కూడా దాదాపు మూడున్నర గంటల వరకు వస్తే… దగ్గరుండి ట్రిమ్ చేయించుకున్నాడు నాని. అందుకే ఆ సినిమాకి అలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా రాలేదు. ఇప్పుడు హిట్ 3 (HIT 3) విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ అయ్యింది. రన్ టైం 2 గంటల 42 నిమిషాల వరకు వచ్చింది.
వయొలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ‘A’ రేటింగ్ తీసుకున్నారు. ఫైనల్ కాపీ రెడీ అయ్యాక కూడా మళ్ళీ చూసి.. ఇంకో 5 నిమిషాలు ట్రిమ్ చేయించాడట. దీంతో ఫైనల్ రన్ టైం 2 గంటల 37 నిమిషాలు వచ్చిందని సమాచారం.