2 ఏళ్ళ క్రితం అంటే 2023 మార్చి 22న ‘రంగమార్తాండ’ (Rangamaarthaanda) ‘ధమ్కీ’ (Das Ka Dhamki) సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన ‘ధమ్కీ’ కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ టాక్ నెగిటివ్ గా వచ్చింది. అందువల్ల వీకెండ్ ముగిశాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. మరోపక్క ‘రంగమార్తాండ’ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కృష్ణవంశీ (Krishna Vamsi) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) మెయిన్ రోల్ చేశాడు. అయితే అతి కీలకమైన పాత్ర చేసిన బ్రహ్మానందంకి (Brahmanandam) ఎక్కువ మార్కులు పడ్డాయి.
‘రంగమార్తాండ’ ఒక రకంగా ప్రకాష్ రాజ్ కంటే బ్రహ్మానందంకే బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఇలాంటి పాత్రలో బ్రహ్మానందంని ఎప్పుడూ చూడలేదు కాబట్టి.. ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. సినిమా కూడా దాని స్థాయికి తగ్గట్టుగా డీసెంట్ గానే ఆడింది. పెర్ఫార్మన్స్ పరంగా చూసుకుంటే విశ్వక్ సేన్ కంటే బ్రహ్మానందం ఎక్కువగా మెప్పించాడు అని చెప్పడంలో సందేహం లేదు.
విచిత్రంగా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత బ్రహ్మానందం, విశ్వక్ సేన్..ల మధ్య మళ్ళీ క్లాష్ వచ్చింది. ఈసారి బ్రహ్మానందం ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే.. విశ్వక్ సేన్ ‘లైలా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరోజు అనగా ఫిబ్రవరి 14నే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈసారి కూడా ఆల్మోస్ట్ 2023 సీన్ రిపీట్ అయ్యింది అని చెప్పాలి. ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.
ముఖ్యంగా బ్రహ్మానందం నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆయన మార్క్ నటన కోసం ఒకసారి సినిమాని చూడొచ్చు అని అంతా చెబుతున్నారు. మరోపక్క ‘లైలా’ (Laila) సినిమాకి నెగిటివ్ టాక్ వస్తుంది. విశ్వక్ సేన్ తప్ప ఆ సినిమా కంటెంట్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా లేదు అని అంతా అంటున్నారు. మరి ‘ధమ్కీ’ మాదిరి ‘లైలా’ మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తుందేమో తెలియాల్సి ఉంది.