2019 టైం వరకు టికెట్ రేట్లు పెంచడం, తగ్గించడం అనేది పెద్ద ఇష్యూగా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకి టికెట్ రేట్లు తగ్గించడం మొదలు పెట్టిందో అక్కడి నుండి మొదలైంది అసలైన ఇష్యూ. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాల కోసమే అన్నట్లు, అతని సినిమాలకి (Movie) కలెక్షన్స్, రికార్డులు రాకుండా చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఆ ప్రభుత్వం టికెట్ రేట్లు తగ్గించేయడం జరిగింది.
Movie
మరోపక్క వేరే హీరోల సినిమాలు వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేది. టికెట్ రేట్ల విషయంలో ఒక పద్ధతి అంటూ లేకుండా ఆ ప్రభుత్వం చేసింది. దీంతో ఏ సినిమాకి ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి, ఏ సినిమాకి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి.. అనే విషయం పై జనాలకి ఓ క్లారిటీ లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది ప్రభుత్వం మారింది.
ఆ వెంటనే రిలీజ్ అయిన పెద్ద సినిమా (Movie) ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) కి టికెట్ రేట్లు భారీగా పెంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. దీంతో ‘కల్కి..’ సినిమా ఏపీలో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ ను అయితే రాబట్టలేదు. బ్రేక్ ఈవెన్ మార్జిన్ కి అలా వచ్చి టచ్ అయ్యి ఆగిపోయింది అంతే..! దీంతో తర్వాత రాబోయే పెద్ద సినిమాలకి ఇలాంటి పరిస్థితి రాకుండా.. టికెట్ రేట్లు పెంచుకోవడంలో కూడా ఓ పద్ధతి ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారట.
ఈ క్రమంలో పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకోవాల్సి వస్తే.. రూ.50 , రూ.75 వరకు మాత్రమే అనుమతి ఇస్తామని ఆయన తేల్చి చెప్పేశారట. సో రాబోయే పెద్ద సినిమాలు.. అంటే ‘దేవర’ (Devara) నుండి సింగిల్ స్క్రీన్స్ కి రూ.50 , మల్టీప్లెక్స్..లకి రూ.75 వరకు మాత్రమే టికెట్ రేట్లు పెంపు ఉంటుందన్న మాట. చాలా వరకు ఇది మంచి నిర్ణయమే.. సామాన్యులకి సినిమా అనేది అందుబాటులో ఉన్నట్లు అవుతుంది.