సినిమా ఇండస్ట్రీలో సహ నటీనటుల మధ్య ఏర్పడే స్నేహబంధాలు తరచుగా రూమర్స్‌కు దారితీస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) , బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ గురించి కూడా అలాంటి గాసిప్స్ నడుస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వచ్చినప్పటినుంచే ఈ గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ గాసిప్‌కు మరింత బలమైన మలుపు తిరిగిన కారణం కార్తిక్ తల్లి మాలా తివారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలే.
ఐఫా అవార్డ్స్ సందర్భంగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఆమెను తన కొడుకుకు కాబోయే భార్య ఎలా ఉండలి అని ఓ ప్రశ్న వేశారు. దీంతో ఆమె “మా ఇంటికి మంచి డాక్టర్ చదువుకున్న అమ్మాయి కోడలిగా రావాలి” అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మాటలు విన్న వెంటనే బాలీవుడ్ మీడియా శ్రీలీలను టార్గెట్ చేసింది. ఎందుకంటే, ఆమె ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాంప్లిమెంట్ ఆమెను ఉద్దేశించిందేనా? అనే అనుమానాలు మరింత పెరిగాయి.
ఇదే సమయంలో, కార్తిక్ ఫ్యామిలీ ఇటీవల ఓ ప్రత్యేక సెలబ్రేషన్‌ను నిర్వహించగా, అందులో శ్రీలీల కూడా హాజరయ్యారని కొన్ని బాలీవుడ్ మీడియా హౌస్‌లు నివేదించాయి. ఈ ప్రైవేట్ పార్టీకి ఆమె హాజరవడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం, వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన బంధం ఉందనే ఊహాగానాలకు కారణంగా మారింది. సహజంగా సినిమా షూటింగ్‌లో నటీనటులు స్నేహంగా ఉండవచ్చు. కానీ కుటుంబ కార్యక్రమాల్లో హాజరైతే, సంబంధం మరింత ప్రైవేట్‌గా మారినట్లు భావిస్తారు.
ఈ లవ్ గాసిప్ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ, కార్తిక్ – శ్రీలీల జంటగా నటించబోయే సినిమా ‘ఆశికీ 3’ ఫ్రాంచైజీలో భాగమా? లేక వేరే సినిమానా? అన్నది ఆసక్తిగా మారింది. సంగీత నేపథ్యంతో తెరకెక్కే ఈ సినిమా, గత లవ్ సినిమాల మాదిరిగానే ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వీరి కెమిస్ట్రీ తెరపై సూపర్ హిట్ అయితే, ఈ రూమర్స్ ఇంకా బలపడతాయనడంలో సందేహం లేదు.