కృష్ణ ప్రధాన పాత్రలో కన్నడ దర్శకుడు హెచ్.మధుసూదన్ ఒక సినిమాను 2007లో చిత్రీకరించారు. దీనికి ‘ప్రేమ చరిత్ర’ అని టైటిల్ పెట్టారు. అంబ మూవీ పతాకంపై శ్రీపాద్ హంచాటే ఈ సినిమాను నిర్మించారు. అయితే, అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు 16 ఏళ్ల తరవాత ఈ సినిమాను ‘కృష్ణ విజయం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దర్శకుడు మధుసూదన్ కన్నడలో ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కించారు.
పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. కృష్ణ సినిమా తన కెరీర్‌లో ఒక మచ్చలా మిగిలిపోకూడదని భావించి విడుదల చేస్తున్నారట. అయితే, కృష్ణ జయంతి సందర్భంగా ‘కృష్ణ విజయం’ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కృష్ణ పర్సనల్ మేకప్‌మేన్ మాధవరావు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అయితే మొదట‘ప్రేమ చరిత్ర’ అనే టైటిల్ పెట్టి సినిమా తీశారు.
ఇప్పుడు దాన్ని ‘కృష్ణ విజయం’గా పేరు మార్చారు. మధుసూదన్ ప్రస్తుతం కన్నడలో చాలా బిజీగా ఉన్నారు. ఒక ఐదు సంవత్సరాలకు సరిపడా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. కానీ, ఈ సినిమా ఆయనకి ఒక చేదు అనుభవంగా మిగిలిపోకూడదు.. తీపిగుర్తుగా మిగలాలి అని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు’ అని వెల్లడించారు. ట్రైలర్ చూసిన తరవాత కృష్ణ మనముందు లేరు అనే మాట తప్ప.. ఇది కొత్తగా తీసిన సినిమాలా ఉందని అభిమానులు అంటున్నారు. ‘మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఈ సినిమాను తీర్చిదిద్ది విడుదల చేస్తున్నారు.
అయినా, కృష్ణ (Krishna) నటిస్తే అది పాత సినిమా, కొత్త సినిమా అనే తేడా ఉండదు. ఎప్పుడో విడుదలైన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఇప్పుడు రీరిలీజ్ అయితే అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. కృష్ణ స్టామినా ఏమీ తగ్గలేదు. ఈ సినిమా రిలీజ్‌ను ఈ నెల (జూన్) ప్లాన్ చేశారు. కృష్ణ అభిమానులు, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా’యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో మెగాబ్రదర్ నాగబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యం.యం.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు.