Akash Puri: ఆయనతో నాన్న సినిమా.. అదే నా కల: ఆకాశ్ పూరి!
- March 17, 2025 / 07:32 PM ISTByFilmy Focus Desk
పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తనయుడిగా, వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడేమో అనుకుంటే.. నేను, నా సినిమాలు అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆకాశ్ (Akash Puri). రకరకాల సినిమాలు చేస్తూ ఫర్వాలేదు అనిపించుకున్నాడు. అయతే ఆయన అనుకున్న, పూరి జగన్నాథ్ అభిమానులు అనుకున్న విజయాన్ని అయితే అందుకోలేదు. ఈ లోగా నేను ‘ఆకాశ్ పూరి’ అని చెప్పాడు. ఇప్పుడు ‘తల్వార్’ అనే ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఆకాశ్ ఓ టీవీ కార్యక్రమానికి వచ్చాడు.
Akash Puri

ఈ క్రమంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే తన చిన్నతనంలోని విషయాలు, తన కోరికలు అందులో ఉన్నాయి కాబట్టి. అందరిలాగే తన తల్లి కూడా చిన్నతనంలో అమ్మాయిలా డ్రెస్ వేసి, మేకప్ వేసి ఫొటో దిగింది అని చెప్పాడు. దానికి సంబంధించిన ఫొటో కూడా చూపించారు. ఆ తర్వాత గుబురు జుట్టుతో ఉన్న ఫొటో చూపిస్తే.. అప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకు వచ్చింది.

ఆ జుట్టు అంటే పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) బాగా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ‘బద్రి’ (Badri) సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి ఆ ఫొటోను పవన్ కల్యాణ్‌కు చూపించారని.. ఆయన ‘మీవోడు బాగున్నాడు పూరి.. ఓసారి సెట్‌కి తీసుకురా’ అని అన్నారట. అలా ఆ సినిమా సెట్‌కి ఆకాశ్ వెళ్లాడట. అక్కడ పవన్ ఆకాశ్‌తో సాయంత్రం వరకు ఆడుకున్నారట. ఆ తర్వాత ‘కెమెరామ్యాన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu) సినిమా షూటింగ్ సమయంలో మరోసారి పవన్‌ను కలిశానని, అప్పుడు ఆయనతో ఫొటో దిగానని చెప్పుకొచ్చాడు ఆకాశ్.

ఆయన పక్కన నిల్చున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి అని చెప్పాడు. తాను చేతులు కట్టుకుని నిలబడదాం అంటే పవన్ చేతులు కట్టుకున్నారు అని అందుకే నిటారుగా ఉండిపోయా అని నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు ఆకాశ్. అది తనకో ఫ్యాన్ మూమెంట్ అని చెప్పాడు.

















