యాంకర్ ప్రదీప్ కి (Pradeep Machiraju) బుల్లితెర పై ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. ముఖ్యంగా లేడీస్లో, ఫ్యామిలీ ఆడియన్స్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇతను బిగ్ స్క్రీన్ పై కూడా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా మారి ఆల్రెడీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’అనే సినిమా చేశాడు. అది కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఇక రెండో ప్రయత్నంగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi) చేశాడు. నితిన్ – భరత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేసింది.
మొదటి రోజు ఈ సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు సో సో ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ గమనిస్తే :
నైజాం | 0.08 cr |
సీడెడ్ | 0.04 cr |
ఆంధ్ర | 0.10 cr |
ఏపీ + ఆంధ్ర (టోటల్) | 0.22 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.06 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 0.28 cr |
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రానికి రూ.3.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.0.28 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.0.42 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.4.02 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి రెండో రోజు నుండి ఏమైనా పికప్ అవుతుందేమో చూడాలి.