అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని మరింత పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకున్న బన్నీ, ఇతర ఇండస్ట్రీల్లోనూ తన కంటూ ప్రత్యేక ముద్ర వేశాడు. ఇతర భాషల టాలెంట్‌ను ప్రోత్సహించే అలవాటు బన్నీకి ఎప్పటినుంచో ఉంది. తాజాగా మలయాళంలో హిట్ అయిన వైలెంట్ యాక్షన్ ఫిల్మ్ మార్కోపై ఆయన ఆసక్తి చూపారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో కనిపించి, తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.
Allu Arjun
మార్కో చిత్ర కథ, కథన శైలి, యాక్షన్ సన్నివేశాలు హై లెవెల్‌లో ఉండటంతో ప్రేక్షకులు సినిమాను మోస్ట్ వైలెంట్ ఫిల్మ్‌గా గా పొగిడేస్తున్నారు. అయితే, చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లడంలో దర్శకుడు హనీఫ్ అదేనీ కీలక పాత్ర పోషించాడు. బన్నీ ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం, హనీఫ్‌కు ప్రత్యేకంగా ఫోన్ చేసి ప్రశంసలు అందించినట్లు సమాచారం.
దర్శకుడి మేకింగ్ స్టైల్, టెక్నికల్ ప్రెజెంటేషన్, కథలోని ఎమోషనల్ డెప్త్ పై బన్నీ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లే డిఫరెంట్ గా ఉందని, ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టిన తీరు హైలైట్‌గా మారిందని అన్నట్లు టాక్. మార్కో కేవలం 20 రోజుల్లో 55 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి, మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ బెస్ట్ హిట్ నిలిచింది.
అంతే కాకుండా, హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి చిత్రానికి దర్శకుడు హనీఫ్ అదేనీ కీలకమైన బలం అని బన్నీ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయనున్న బన్నీ, అదే సమయంలో ఇతర ఇండస్ట్రీల టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ తన సపోర్ట్‌ను అందిస్తున్నాడు. లేటెస్ట్ గా సంజయ్ లీలా భన్సాలీ, వంటి ప్రముఖులతో చర్చలు జరుపుతున్న అల్లు అర్జున్, తన పాన్ ఇండియా క్రేజ్‌ను మరింత విస్తరించుకునే పనిలో ఉన్నాడు.