‘హరిహర వీరమల్లు’ సినిమా మరో 3 రోజుల్లో అంటే జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 2 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న సినిమా ఇది. మొదట ఈ సినిమా పై ఆడియన్స్ లో అంతగా ఆసక్తి లేదు. కానీ ట్రైలర్ బాగా హైప్ తెచ్చింది. సినిమా చూడాలనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ఇక ఈరోజు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి మాట్లాడటం మరింత ప్లస్ అయ్యింది. ఈ సందర్భంగా ఏ.ఎం.రత్నం ఎమోషనల్ అయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ” ఇన్ని రోజులు ఏంటంటే ఆయన ‘హరిహర వీరమల్లు’ గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదు. వాస్తవానికి ఆయన ఏ సినిమా గురించి మాట్లాడలేదు చెప్పాలంటే..! అభిమానులు చిన్న టైటిల్ కాబట్టి.. ‘ఓజి ఓజి’ అరుస్తున్నారేమో. మాది ‘హరిహర వీరమల్లు’ అనే పెద్ద టైటిల్ ఉంది కాబట్టి అరవడం లేదేమో అని అనుకున్నాను. కనీసం ‘వీర వీర’ అని అయినా అరిస్తే బాగుండేది కదా అని ఫీలయ్యేవాడిని. కానీ ఏ అభిమాని కూడా ‘వీరమల్లు’ గురించి మాట్లాడింది లేదు.
కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారే వచ్చి చెప్పడం సంతోషాన్నిచ్చింది” అంటూ ఏ.ఎం.రత్నం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. కానీ వాస్తవానికి టైటిల్ చిన్నదని అభిమానులు ‘ఓజి ఓజి’ అని అరవడం కాదు.. ఆ సినిమాకు ఉన్న హైప్ అలాంటిది. ‘ఓజి’ హైప్ ను ప్రస్తుతానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా మ్యాచ్ చేయలేదు అనడంలో సందేహం లేదు. అయితే కంటెంట్ కనుక బాగుంటే.. ‘హరిహర వీరమల్లు’ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం ఖాయం అనే చెప్పాలి.
“#PawanKalyan Fans అందరు OG OG అంటుంటే Feel అయ్యేవాణ్ణి…Veera Veera అని కూడా అరవొచ్చు కదా ఒకసారి అయినా అని” – #AMRathnam
ఈరోజు రత్నం గారి కోసం అభిమానులు అంతా ఈవెంట్ లో Veera Veera అని అరవండి friends #HariHaraVeeraMallu pic.twitter.com/GkZ5W5oBru
— Vedi..VediGa… (@vedivediga) July 21, 2025