నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమిగోస్’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆషిక రంగనాథ్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమవుతుంది. ‘బింబిసార’ తర్వాత కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న చిత్రం కావడం..
అలాగే ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాల తర్వాత ‘మైత్రి’ వారి నిర్మాణంలో రాబోతున్న మూవీ కావడంతో దీనికి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.మరి ఈ సినిమా హిట్ కొట్టడానికి ఎంత టార్గెట్ ను రీచ్ అవ్వాలి వంటి వివరాలు ఒకసారి గమనిస్తే :
నైజాం
4.20 cr
సీడెడ్
2.40 cr
ఉత్తరాంధ్ర
1.80 cr
ఈస్ట్
1.20 cr
వెస్ట్
1.05 cr
గుంటూరు
1.40 cr
కృష్ణా
1.10 cr
నెల్లూరు
0.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
13.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.65 cr
ఓవర్సీస్
0.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
15.22 cr (షేర్)
‘అమిగోస్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.22 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ గత చిత్రమైన ‘బింబిసార’ రూ.35 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసింది. అయితే ‘అమిగోస్’ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయి.
ఇది అన్ సీజన్ కాబట్టి.. స్ట్రాంగ్ మౌత్ టాక్ వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అసాధ్యమనే చెప్పాలి. చూడాలి మరి ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో..!