టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్న రామ్ (Ram) మరికొన్ని గంటల్లో డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి అనుమతులు లభించడం కొసమెరుపు.
ఏపీలో 35 రూపాయల మేర టికెట్ రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తే టికెట్ రేట్ల పెంపు అనేది సమస్య కాదు. టాక్ అటూఇటుగా ఉంటే మాత్రం టికెట్ రేట్ల పెంపు వల్ల ఈ సినిమాకు కొంతమేర నష్టం తప్పదు. ఏపీలో టికెట్ రేట్ల పెంపు బుకింగ్స్ పై కొంతమేర ప్రభావం చూపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
మరోవైపు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పూరీ జగన్నాథ్ కు నిర్మాతగా కూడా ఈ సినిమా సక్సెస్ కావాల్సిన అవసరం ఎంతో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ కెరీర్ పుంజుకోవాలంటే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాల్సి ఉంది. పూరీ సినిమా రిజల్ట్ గురించి మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.
ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానున్న అన్ని సినిమాలు సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాలని సినీ అభిమానులు భావిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పూరీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో చూడాల్సి ఉంది.