Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ … జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ ..!
- April 21, 2025 / 05:11 PM ISTByPhani Kumar
నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా విజయశాంతి (Vijaya Shanthi) కీలక పాత్రలో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) రూపొందింది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకుడు. ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి …. శ్రీకాంత్(Srikanth) , బబ్లూ పృథ్వీరాజ్ (Babloo Prithiveeraj) కీలక పాత్రలు పోషించారు. మంచి క్యాస్టింగ్ ఉండటం.. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా పై రిలీజ్ కి ముందు హైప్ ఉంది.
Arjun Son Of Vyjayanthi Collections:

రిలీజ్ రోజున టాక్ కూడా పాజిటివ్ గానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 1.27 cr |
| సీడెడ్ | 0.48 cr |
| ఉత్తరాంధ్ర | 0.40 cr |
| ఈస్ట్ | 0.25 cr |
| వెస్ట్ | 0.18 cr |
| గుంటూరు | 0.35 cr |
| కృష్ణా | 0.31 cr |
| నెల్లూరు | 0.16 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.40 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.22 cr |
| ఓవర్సీస్ | 0.40 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్ ) | 4.02 కోట్లు(షేర్) |
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాకు రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.5.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.55 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.13.59 కోట్లు షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. వీక్ డేస్లో కూడా నిలకడగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉంటుంది.












