దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వెండితెరపై చెక్కిన శిల్పం “బాహుబలి : బిగినింగ్” రిలీజ్ తర్వాత రికార్డులను సృష్టించగా … ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ముందే చరిత్రను లిఖిస్తోంది. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ 30 శాతం ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని మీడియాతో రాజమౌళి చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు హక్కులకోసం ఎగబడుతున్నారు. మొన్న 40 కోట్లు చెల్లించి అమెరికా థియేటర్ హక్కులను ఓ సంస్థ సొంతం చేసుకుంది.
తాజాగా నైజాం(తెలంగాణ) ఏరియా హక్కులు కూడా భారీ మొత్తంలో సేల్ అయింది. ఏషియన్ ఎంటర్ ప్రయిజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు నైజాం హక్కులను 50 కోట్లకు దక్కించుకున్నారు. బాహుబలి బిగినింగ్ 23 కోట్లకు నైజం హక్కులు పలకగా బాహుబలి 2 రెట్టింపు ధరకు అమ్ముడు పోవడం విశేషం. లాభాలు కూడా అంతే స్థాయిలో ఉంటుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల కానుంది.