పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించనున్న బాలకృష్ణ
- February 25, 2017 / 07:12 AM ISTByFilmy Focus
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తర్వాత చేయనున్న సినిమా ఫిక్స్ అయింది. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య 101 మూవీ చేయనున్నారు. ఈ విషయాన్ని పూరీ సోషల్ మీడియాలో వెల్లడించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. షూటింగ్ ప్రారంభపు తేదీతో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించి ఔరా అనిపించారు. బాలకృష్ణ, పూరి కాంబినేషన్లో రానున్న సినిమా మార్చి 9న పూజా కార్యక్రమాలు జరుపుకొని వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది.
ఈ రాకింగ్ అనౌన్స్ మెంట్ నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. పూరి డైలాగులు బాలకృష్ణ నోటా వస్తుంటే థియేటర్ దద్దరిల్లి పోతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేర్ కాంబినేషన్ సంచనాలకు దారితీస్తుందని సినీ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అయితే ఇది మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమానా ? లేకుంటే .. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం రాసుకున్న “జనగణమన” స్టోరీతో బాలయ్య వస్తున్నారా ? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















