కొన్నిసార్లు ఇండస్ట్రీలో కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి ఏంటి అనేది మాత్రం తెలియకుండా ఎప్పటికీ అవి ఒక మిస్టరీ గానే మారిపోతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయని చెప్పాలి అయితే 2004వ సంవత్సరంలో బాలకృష్ణ ఇంట్లో బెల్లంకొండ సురేష్ బాబు జ్యోతిష్కుడు సత్యనారాయణ చౌదరిలపై పెద్ద ఎత్తున కాల్పులు జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అసలు బాలకృష్ణ వీరిపై కాల్పులు జరగడానికి కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఆరా తీశారు.
అయితే అప్పుడు ఈ విషయం గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయం మాత్రం తెలియడం లేదు.అయితే తాజాగా బెల్లంకొండ గణేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అప్పటి ఘటన గురించి స్పందించారు. బెల్లంకొండ సురేష్ తనయుడుగా గణేష్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గణేష్ హీరోగా నటించిన తాజా చిత్రం స్టూడెంట్ సర్.
ఈ సినిమా జూన్ రెండో తేదీ విడుదల కానున్న నేపథ్యంలో (Bellamkonda Ganesh) ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా గణేష్ దాదాపు 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన గురించి మాట్లాడారు. కాల్పుల ఘటన జరిగినప్పుడు నాకు నిండా పదేళ్లు కూడా లేవు. అసలు ఏం జరిగిందో కూడా నాకు ఐడియా లేదు. ఆ ఇన్‌సిడెంట్ గురించి నేను, మా ఫ్యామిలీ కూడా ఈ విషయం గురించి మా నాన్నతో మాట్లాడలేదు.
ఇప్పుడు నాన్న ఆ సంఘటన గుర్తు చేసుకుని ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమాత్రం లేదని మేము భావిస్తున్నాము అంటూ గణేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.