యంగ్ హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) . దర్శకుడు మారుతి టీం నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై కొంతమంది ఆడియన్స్ దృష్టి పడింది. ‘గీతా సుబ్రమణ్యం’, ‘పెళ్లిగోల 2’ వంటి వెబ్ సిరీస్…లు తెరకెక్కించిన శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్..లో మారుతి (Maruthi Dasari) మార్క్ కనిపించింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. కామెడీ, ఎమోషన్ బాగా వర్కౌట్ అయినట్టు అంతా చెప్పుకున్నారు.
మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. కానీ 2వ రోజు నుండి ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) ఊపు ముందు ఈ సినిమా నిలబడలేకపోయింది. వీకెండ్ ను పెద్దగా వాడుకోలేకపోయిన ఈ సినిమా వీక్ డేస్ లో మరింత చతికిలబడింది. ఒకసారి (Bhale Unnade Collections) 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
‘భలే ఉన్నాడు’ చిత్రానికి రూ.1.53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.80 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.0 కోట్ల షేర్ ను రాబట్టాలి. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. రాజ్ తరుణ్ ఫామ్లో లేకపోవడం వల్ల.. అలాగే ‘మత్తు వదలరా 2’ ఫుల్ స్వింగ్ లో ఉండటంతో ‘భలే ఉన్నాడే’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చాటలేకపోతుంది.