టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. ‘భద్ర’ తో డైరెక్టర్ గా మారిన ఇతను.. ఆ తర్వాత ‘తులసి’ ‘సింహా’ వంటి చిత్రాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఆ తర్వాత ‘దమ్ము’ ‘లెజెండ్’ ‘సరైనోడు’ ‘జయ జానకి నాయక’ ‘అఖండ’ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు. బోయపాటి సినిమాలకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తూ ఉంటాయి.
తాజాగా రిలీజ్ అయిన ‘స్కంద’ విషయంలో కూడా ఇది రిపీట్ అవుతుంది. ‘స్కంద’ మొదటి రోజు రామ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. రెండో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ పర్వాలేదు అనిపించింది. ఇక శని, ఆదివారాలతో పాటు సోమవారం రోజున గాంధీ జయంతి సెలవు ఉంది కాబట్టి.. ఆరోజు కూడా భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ లు ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే..
బోయపాటి శ్రీనుతో సినిమా అంటే బడా ప్రొడక్షన్ హౌస్ లు.. ఎగబడుతున్నాయి.భారీగా పారితోషికాలు ఇచ్చేనందుకు కూడా వెనుకాడడం లేదు. ఇక ‘స్కంద’ సినిమా కోసం కూడా ఆయన ఏకంగా రూ.15 కోట్లు పారితోషికం అందుకున్నాడట. అంతేకాకుండా లాభాల్లో వాటా కూడా అందుకున్నాడు అని తెలుస్తుంది. మొత్తంగా ‘స్కంద’ రూపంలో ఆయనకు రూ.20 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం.నెక్స్ట్ సినిమాకి బోయపాటి రేంజ్ రూ.25 కోట్లకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.