Brahma Anandam First Review: రాజా గౌతమ్ హీరోగా హిట్టు కొడతాడా?
- February 13, 2025 / 05:12 PM ISTByFilmy Focus
[Click Here For The Full Detailed Review]
బ్రహ్మానందం (Brahmanandam) ఒకప్పటిలా ఎక్కువ సినిమాలు చేయడం లేదు. నటించే కొన్ని సినిమాల్లో కూడా రెగ్యులర్ పాత్రలు చేయడం లేదు. ‘జాతి రత్నాలు’ ‘రంగమార్తాండ’ ‘కీడా కోలా’ ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన మరో వైవిధ్యమైన సినిమా ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam). బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ (Raja Goutham) హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మించారు.
Brahma Anandam First Review:

గతంలో రాహుల్ ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ (Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో ‘బ్రహ్మ ఆనందం’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆర్.వి.ఎస్.నిఖిల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని (Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్ (Aishwarya Hollakal),దివిజ ప్రభాకర్ (Divija Prabhakar).. లు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోని పెద్దలకి చూపించడం జరిగింది.
సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. ఈ సినిమా రన్ టైం 2 గంటల 28 నిమిషాలు ఉంటుందట. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన హీరో(రాజా గౌతమ్) తన తాత(బ్రహ్మానందం) వద్ద పెరుగుతాడు. అయితే అతను బలవంతంగా స్వార్థపరుడు కావాలని అనుకుంటాడు. ప్రొఫెషన్ పరంగా నటుడిగా ఎదగాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి రూ.10 లక్షలు అవసరం పడుతుంది. దీనికోసం వాళ్ళ తాతని అడిగితే.. ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మి ఇస్తాను అంటాడు.

కాకపోతే అందుకు హీరోకి కొన్ని కండిషన్స్ పెడతాడు. అవి ఏంటి? తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన కథ. బ్రహ్మానందం నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎప్పటిలానే అదరగొట్టేశాడట. కానీ ఈ సినిమాతో రాజా గౌతమ్ నటుడిగా బాగా ఇంప్రూవ్ అయ్యాడట. కొన్ని సీన్స్ లో అయితే నానిని గుర్తుచేసినట్టు చెబుతున్నారు. సినిమాలో ఫన్, ఎమోషన్ సమాంతరంగా ఉన్నట్టు చెబుతున్నారు. కచ్చితంగా ఈ వీకెండ్ కి సైలెంట్ గా హిట్టు కొట్టే సినిమా ఇది అవుతుంది అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో.. రిలీజ్ రోజున తెలుస్తుంది.












