ప్రముఖ రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి(సి.నా.రె.) మనల్ని విడిచి వెళ్లిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. 1931, జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట్లో సి.నా.రె. జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. ఉన్నత విద్య హైదరాబాద్ లో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యారు. అలా చిన్నప్పటి నుంచే రచనలు చేస్తూ జ్ఞానపీఠ్ అవార్డు అందుకునేంత ఎదిగారు.
1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. 1977లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి తరం హీరోలకు యుగళ, విషాద గీతాలను రాశారు. “అన్నయ్య సన్నిధి (బంగారు గాజులు), గోగులు పూచే (ముత్యాలు ముగ్గు), నాన్నా నీ మనసే వెన్న.. ఇలా అయన రాసిన ఎన్నో సినీ పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. ఆయన మరణంతో సినీ, సాహిత్య ప్రియుల గొంతులు మూగబోయాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.