మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతుంది. ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం కోసం ఎంతో యాక్టివ్ గా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు చిరు. ఇందులో భాగంగా ఆయన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం :
ప్ర) ఈరోజుతో(జనవరి 11) మీరు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్ళు పూర్తవుతుంది? ‘ఖైదీ నెంబర్ 150’ జనవరి 11కే రిలీజ్ అయ్యింది..!
చిరంజీవి : హా.. నిజమే..! చాలా సంతోషంగా ఉంది. నాకు ఇక్కడే(సినీ పరిశ్రమలో) ఆనందం, ప్రశాంతత ఉంటాయి.
ప్ర) ఈ 6 ఏళ్ళలో సినీ పరిశ్రమలో మీరు చూసిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
చిరంజీవి : ఏమి లేదండీ.. అంతా బాగానే ఉంది. హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాను.
ప్ర) కారవ్యాన్ సంస్కృతి వల్ల నిర్మాతల బడ్జెట్ పై అదనపు భారం పడుతుంది అన్నారు?
చిరంజీవి : కరోనాకి ముందు కారవ్యాన్ గురించి నేను చెప్పింది నిజమే. అయితే కారవ్యాన్ ఉండాలి. ఎందుకంటే హీరోయిన్లు డ్రెస్ ఛేంజ్ చేసుకోవడానికి వంటి వాటికి అలాంటి సౌకర్యాలు ఉండాలి. నేను చెప్పింది.. కారవ్యాన్ కు నటీనటులు ఒక షాట్ ముగిసిన వెంటనే వెళ్లిపోకుండా.. తోటి నటీనటులతో, టెక్నీషియన్లతో కొంత సమయం గడపాలనే ఉద్దేశం పై నేను ఆ మాట అనడం జరిగింది.
ప్ర) ‘వాల్తేరు వీరయ్య’లో వింటేజ్ వైబ్ కనిపిస్తుంది.?
చిరంజీవి : ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రాను రాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని దృష్టిలో పెట్టుకొని.. మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాను.
ప్ర) మీరు గొప్ప స్టార్? ఇండస్ట్రీ అంతా మీకు గొప్ప రెస్పెచ్త్ ఇస్తూ ఉంటుంది. యంగ్ డైరెక్టర్స్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు .. మీ పై ఉండే రెస్పెక్ట్ వల్ల అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు కదా?
చిరంజీవి : నేను ఎప్పుడూ కూడా మానిటర్ ను చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంతవరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడు ‘ఓకే’ కోసం ఎదురు చూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను.
ప్ర) ఇన్నేళ్ళ తర్వాత కూడా కసితో పని చేయాలి అనుకోవడానికి ఏ ఎలిమెంట్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది?
చిరంజీవి : కేవలం ప్రేక్షకుల ఆదరణ. అదే నా డ్రైవింగ్ ఫోర్స్. ‘బావగారు బాగున్నారా’ లో బంగీ జంప్ చేస్తున్నపుడు.. ఇది ప్రేక్షకులు చూస్తే ‘ఎంత ఎక్సయిట్ గా ఫీలవుతారు..వాట్ ఏ ఫీట్ అని క్లాప్స్ కొడతారు’ అనే ఎక్సయిట్మెంట్. ఇలాంటివే నేను కసిగా పనిచేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాయి.
ప్ర) ‘అన్నయ్య’ లో రవితేజ కి, ‘వాల్తేరు వీరయ్య’ లో రవితేజకి మీరు గమనించిన మార్పు ఏంటి?
చిరంజీవి : రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తరువాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో ఉన్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ, ఉత్సాహం ఉన్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ ఉంటుంది. ఆ పాత్రకు అతను 100 శాతం న్యాయం చేశాడు.
ప్ర) ‘మైత్రీ మూవీ మేకర్స్’ గురించి చెప్పండి ?
చిరంజీవి : ఇలాంటి నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. ‘ఖర్చు విషయంలో జాగ్రత్త. మీ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి’అని చెబుతుంటాను. బాబీ కి కూడా అదే విషయం చెప్పాను.అతను ఎక్కడా కూడా వృధా చేయలేదు. షూటింగ్ లో ఒక్కో రోజు నలభై లక్షల రూపాయలు కూడా ఖర్చు అయ్యేది. మారేడిమిల్లి లో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేషియాలో కూడా షూట్ చేశాం.
ప్ర) సంక్రాంతికి మీ సినిమా ఎప్పుడూ ముందు వస్తుంది. ఈసారి లాస్ట్ వస్తుంది. ఆ నిర్ణయం కూడా మీదే అట కదా?
చిరంజీవి : మా సంస్థ నుండి 2 సినిమాలు వస్తున్నాయి అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైనా తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే కనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి ఉంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను.
ప్ర) ఒకరోజు వెనక్కు వెళ్లడం వల్ల రిలీజ్ అయిన సినిమాల కారణంగా థియేటర్లు టైట్ అవుతాయి కదా .. ?
చిరంజీవి : ఫస్ట్ డే రికార్డ్ కోసం తాపత్రయపడే వారైతే గనుక మా రెవెన్యు తగ్గిపోతుందనే ఫీలింగ్ ఉంటుంది. రావాల్సిన షేర్ వస్తుందనే నమ్మకం ఉంటే ఒక రోజు లేట్ అయినా పర్వాలేదు. లాంగ్ రన్లో కవర్ అయిపోతుంది.
ప్ర) ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్లో రవితేజ, మీరు డైలాగులు మార్చుకోవడం పై మీ స్పందన ఏంటి?
చిరంజీవి : ఒక ఫ్యాన్ బాయ్ గా దర్శకుడికి వచ్చిన ఆలోచన అది. నన్ను ఇష్టపడే రవితేజ కి నా డైలాగ్ చెప్పడం తనకి ఫ్యాన్ బాయ్ మూమెంట్. అలాగే నా తమ్ముడి లాంటి రవితేజ డైలాగ్ ని నేను చెప్పడం సరదాగా అనిపించింది.
ప్ర) హీరోయిన్ శృతి హాసన్ తో డ్యాన్సులు చేయడం ఎలా అనిపించింది?
చిరంజీవి : నా స్నేహితుడు కమల్ హాసన్ గారి కూతురు. తన డీఎన్ ఏ లోనే డ్యాన్స్ ఉంది. అవలీలగా డాన్స్ చేస్తుంటుంది. అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్ చేయాలని వుంది.
ప్ర) శృతి హాసన్ తో ఒక ఫైట్ కూడా చేశారట?
చిరంజీవి : అవును.. నిజమే..! చిన్న ఫైట్..!
ప్ర) దేవిశ్రీ తో గతంలో వర్క్ చేశారు ? ఈ మూవీకి ఎలా అనిపించింది?
చిరంజీవి : దేవిశ్రీ చాలా ఎనర్జిటిక్ గా ఉంటాడు. వాల్తేరు వీరయ్య మ్యూజిక్ చాలా మనసు పెట్టి చేశాడు. నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాట చాలా చిలిపితనంతో రాసి చేశాడు. అలాగే బాస్ పార్టీ కూడా. ఇందులో ఉండే పాటలన్నీ నాకు ఇష్టం. నీకేమో అందం ఎక్కువ పాట కూడా నాకు చాలా ఇష్టం. నా ఫేవరేట్ సాంగ్ ఇది.
ప్ర) బాబీ సింహా తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
చిరంజీవి : బాబీ సింహా జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు. నా సినిమాల్లో డైలాగులు పాటలు అవలీలగా చెప్పాడు. తనది తమిళనాడు అనుకున్నాను. మన తెలుగువాడే అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అతను.
ప్ర) దర్శకుడు బాబీతో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
చిరంజీవి : బాబీకి నేను ఫ్యాన్ అయ్యాను అని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అతని హార్డ్ వర్క్ చూసి ఫ్యాన్ అయ్యాను. వాళ్ళ నాన్న గారు చనిపోయిన తర్వాత చిన్న దినం అయిన వెంటనే అంత బాధను దిగమింగుకొని సినిమా కోసం పని చేశాడు. అతని కమిట్ మెంట్ కి హ్యాట్సప్ చెప్పాలి.