హీరోల యందు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) హీరోలు వేరయా అని అనొచ్చు. ఆయన ఏ భాషలో సినిమా తీసినా, ఏ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా చేసినా ఆయన హీరో మాత్రం డిఫరెంట్‌గా ఉంటాడు. చాలా కోపంగా, అంతే ప్రేమగా కనిపిస్తాడు. తన వాళ్లు అంటే ఓ రకం జోన్‌లోకి వెళ్లిపోతాడు. అసలు సందీప్ రెడ్డి వంగా ఇలాంటి పాత్రలు రాయడానికి కారణం ఎవరు? ఏమో ఆయన రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తుంటే అది చిరంజీవే అని అనిపిస్తోంది.
Chiranjeevi
సందీప్ రెడ్డి వంగాకు ‘భద్రకాళీ పిక్చర్స్’ అనే బ్యానర్ ఉందనే విషయం తెలిసిందే. ఆ బ్యానర్ మీదే ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగులో చేసినా, హిందీలో చేసినా ఆ బ్యానర్ ఉంటుంది. ఆ సంస్థ ఆఫీసు ఫొటోను ఆయన ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేశారు. అందులో చూస్తే ఓ ఫొటో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఫొటో కనిపించేలా ఆయన ఆ పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది చిరంజీవి.
‘ఆరాధన’ (Aradhana) సినిమాలో ఓ సీన్‌లో పులిరాజుగా చిరంజీవి (Chiranjeevi) ఇచ్చే పెక్యూలియర్ ఎక్స్‌ప్రెషన్ ఆయన ఆఫీసులో ఫొటోగా ఉంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది.. ఇంకా చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగా హీరోలా ఉంటుంది. అంటే ‘ఆరాధన’ పులిరాజు పాత్రే సందీప్ రెడ్డి వంగా డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు. ఇంత చెప్పాక సందీప్ రెడ్డి వంగా చిరంజీవికి పెద్ద అభిమాని మళ్లీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. అన్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. చిరంజీవి అగ్రెసివ్ కారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలంంటే ‘మాస్టర్’ (Master) సినిమా చూడండి.
ఓ సీన్‌లో చిరంజీవి వేసుకున్న షర్ట్ రంగు, ఫేస్ ఎక్స్‌ప్రెషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో సహా వివరించారు. ఇదంతా ఎందుకు అంటే.. ఆయన సినిమాల మీద, పాత్రల మీద చిరంజీవి ప్రభావం ఎంతుందో చెప్పడానికి. ఇంత చెప్పిన ‘ఆరాధన’ సినిమాలో ఆ ఎక్స్‌ప్రెషన్ ఏ సీన్‌లోనిదో చెప్పపోతే ఎలా అనుకుంటున్నారా? ఆ సినిమాలో ముక్కోపి, కోపిష్టి అయిన పులి రాజుని హీరోయిన్ సుహాసిని (Suhasini) లాగి చెంపదెబ్బ కొడుతుంది అప్పుడు చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషనే సందీప్ రెడ్డి వంగా ఆఫీసులో ఉంది.