విక్టరీ వెంకటేష్(Venkatesh Daggubati) , దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) 3వ వారం కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ సినిమా డీసెంట్ షేర్స్ ను రాబడుతుంది. అయితే 21వ రోజు ఈ సినిమా రూ.80 లక్షల వరకు షేర్ ను రాబట్టింది.20 రోజుల వరకు ఈ సినిమా కోటి రూపాయలు పైనే షేర్ ని కలెక్ట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.
Sankranthiki Vasthunam Collections:
ఇప్పటికే ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ‘సరిలేరు నీకెవ్వరు'(Sarileru Neekevvaru) వంటి సినిమాల కలెక్షన్స్ ను అధిగమించిన ఈ సినిమా గ్రాస్ పరంగా.. ‘అల వైకుంఠపురములో’ ఫుల్ రన్ కలెక్షన్స్ ను కూడా అధిగమించింది. ఒకసారి 3 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాకు రూ.40 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.41 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 21 రోజుల్లో రూ.147.75 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.106.75 కోట్ల లాభాలు అందించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది.ఈ వారం నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ (Thandel) రిలీజ్ అవుతుంది కాబట్టి.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హవా ముగిసే అవకాశాలు ఉన్నాయి.