సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా, లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ (Coolie) సినిమా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రజినీ అభిమానులు మాత్రమే కాదు, మొత్తం సినీ ప్రేమికులు ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. యాక్షన్, గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇప్పటికే భారీ క్రేజ్ ఉంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో కూలీ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకోబోతున్నట్లు సమాచారం.
లోకేష్ – విజయ్ (Vijay Thalapathy) కాంబినేషన్‌లో వచ్చిన లియో (LEO) సినిమాను కూడా సితారే విడుదల చేసింది. ఆ సమయంలో సుమారు 20 కోట్ల రూపాయలతో రైట్స్ కొనుగోలు చేసి, బాక్సాఫీస్ వద్ద దాదాపు 9 కోట్ల లాభాన్ని సాధించినట్లు టాక్. ఇప్పుడు కూలీ మీద అంచనాలు మరింత ఎక్కువగా ఉండటంతో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈసారి పెద్ద మొత్తంలో బేరం కుదుర్చుకొనున్నట్లు తెలుస్తోంది. ఈసారి తెలుగు రైట్స్ రేటు సుమారు 28 నుంచి 30 కోట్ల వరకు పలికే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
లోకేష్ స్టైల్, రజినీ క్రేజ్, మల్టీ స్టారర్ కావడంతో ఈ భారీ డీల్ సెట్టయ్యే అవకాశం ఉందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. రేపో మాపో సితార రైట్స్ దక్కించుకున్నట్లు అఫీషియల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్, మార్చి చివర్లో షూటింగ్ మొత్తం ముగించడానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి చివర్లో గ్లింప్స్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మొదట మే 1న విడుదల ప్లాన్ చేసినా, ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అవుతున్నట్లు టాక్. కూలీ ప్రమోషన్‌లో మొదటి టీజర్‌తోనే బిగ్ హిట్ అందుకున్నందున, ఫుల్ లెంగ్త్ ట్రైలర్, సాంగ్స్ వచ్చాక మరింత క్రేజ్ పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక సితార ఎంటర్టైనమెంట్స్ నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఈసారి కూలీతో ఎంత లాభం పొందుతారో చూడాలి.