నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బాబీ కొల్లి (Bobby) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి షోతోనే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. బాలకృష్ణ కెరీర్లోనే ‘డాకు మహారాజ్’ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. బాలకృష్ణ అంటే కేవలం కత్తులతో నరకడం, డబుల్ యాక్షన్, సీమ బ్యాక్ డ్రాప్లో ఒక ఫ్లాష్ బ్యాక్..
Daaku Maharaaj
వంటివి మాత్రమే అని డిసైడ్ అయిన దర్శకులకి.. కొత్త మార్గం చూపించాడు దర్శకుడు బాబీ. ఫస్ట్ హాఫ్ లో బాలయ్యని చాలా స్టైలిష్ గా చూపించాడు. సెకండాఫ్ లో బాలయ్యని ఒక ఎడ్యుకేటెడ్ గా చూపించి ఆ తర్వాత వీరుడుగా మారడం అనే ట్రాక్ కూడా బాగుంటుంది. ఇక ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు… డిజిటల్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వాళ్ళు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం.
అందుతున్న సమాచారం ప్రకారం.. ‘డాకు మహారాజ్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 9 నుండి నెట్ ఫ్లిక్స్ లో ‘డాకు మహారాజ్’ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట. కేవలం 4 వారాల థియేట్రికల్ రన్ కే, ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే విధంగా అగ్రిమెంట్ జరిగింది అంటున్నారు. చూడాలి మరి..అందులో ఎంతవరకు నిజముందో..!