మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) డెబ్యూ మూవీగా ‘ఉప్పెన’ (Uppena) వచ్చింది. హీరోయిన్ కృతి శెట్టికి (Krithi Shetty) కూడా ఇది డెబ్యూ మూవీనే.! దర్శకుడు బుచ్చిబాబుకి (Buchi Babu Sana) కూడా డెబ్యూ మూవీనే..! కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ ఇది. 2021 లో ఫిబ్రవరి వంటి అన్- సీజన్లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. సినిమాలో కథ నెక్స్ట్ లెవెల్లో ఏమీ ఉండదు. రెగ్యులర్ లవ్ స్టోరీనే..! కానీ ‘దఢక్’ లాంటి సినిమాలో ఉండే ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది.
Naga Chaitanya , Vaishnav Tej
రిలీజ్ కి ముందు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అది ‘ఉప్పెన’ కి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. సరిగ్గా ఇప్పుడు ‘తండేల్’ (Thandel) కూడా ‘ఉప్పెన’ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమాకి చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకుడు. ఇది కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ. దీనికి కూడా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన 3 పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘ఉప్పెన’ ‘తండేల్’ సినిమాలకి ఉన్న ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే.., ‘తండేల్’ కూడా ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో రిలీజ్ అవుతుంది. అలాగే దీనికి కూడా హీరోయిన్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. మరి ‘తండేల్’ కూడా ‘ఉప్పెన’ మాదిరి సూపర్ హిట్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 7న ‘తండేల్’ రిలీజ్ కాబోతోంది. వరుస ప్లాపుల్లో ఉన్న నాగ చైతన్య (Naga Chaitanya) ‘తండేల్’ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.