నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్లతో వరుస ఎపిసోడ్స్ ప్లాన్ చేసింది ఆహా. వాటిని స్ట్రీమ్ చేసుకునేందుకు పక్కా ప్లానింగ్ కూడా వేసుకుంది. రైట్ టైంలో స్ట్రీమింగ్ చేయాలని ఆహా టీం ప్లాన్ చేసుకుంటే.. షూటింగ్ జరుగుతుండగానే వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, అలాగే షోలో ఎలాంటి ప్రశ్నలు బాలయ్య అడిగాడు ఎలాంటి సమాధానాలు షోలో పాల్గొన్న గెస్ట్ చెప్పాడు వంటి వివరాలు ముందే నెట్టింట దర్శనమిస్తున్నాయి.
దీంతో ‘ఆహా’ మీడియా ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన తర్వాత జస్టిస్ సంజీవ్ సన్దేవ్ కీలక ఆదేశాలు జారీ చేసారని తెలుస్తుంది. ఈ టాక్ షోకు సంబంధించిన అనధికార స్ట్రీమింగ్, ప్రసారాలను వెంటనే తొలగించాలని… టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల షో వ్యూయర్ షిప్ దెబ్బ తింటుందని ఆహా వారు కోర్టుకు విజ్ఞప్తి చేసిన మేరకు కఠిన ఆంక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ ఎపిసోడ్ గురువారం అంటే డిసెంబర్ 29 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మిగిలిన ఎపిసోడ్లు పైరేట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా గురువారం నాడు లాయర్ ప్రవీణ్ ఆనంద్, అమిత్ నాయక్లు న్యాయస్థానాన్ని ఆహా యూనిట్ కోరింది. ఇందుకు గాను ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని వేడుకున్నారు. దీనికి న్యాయస్థానం కూడా ఆమోదం తెలిపింది