తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 వ సంవత్సరంలో లివర్ క్యాన్సర్ తో మరణించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన మరణించినప్పటికీ వెండి తెరపై ఈయన సజీవంగానే ఉన్నారని చెప్పాలి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన కామెడీ ద్వారా అందరిని మెప్పించిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇకపోతే తాజాగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కుమారుడు రవి బ్రహ్మ తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తన తండ్రి గురించి కొన్ని విషయాలను తెలియచేశారు. ప్రస్తుతం తాము ఈ స్థాయిలో ఉన్నాము అంటే అందుకు గల కారణం తన తండ్రి అని చిన్నప్పటి నుంచి ఏ కష్టం లేకుండా పెంచారని తెలిపారు. ఇకపోతే 2001వ సంవత్సరంలో నువ్వు నేను సినిమా ఈవెంట్ కివెళ్లి వస్తుండగా ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నాన్నకు తలపై 21 కుట్లు పడగా చేతికి రాడ్ వేసి సర్జరీ చేశారు.
ఇలా పెద్ద ప్రమాదం నుంచి నాన్న బయటపడ్డారు రెండోసారి 2005వ సంవత్సరంలో నాన్న సిగరెట్ ఎక్కువగా తాగటం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ సోకి దాదాపు పది రోజులపాటు కోమాలోకి వెళ్లిపోయారు.ఇలా రెండుసార్లు నాన్నను బ్రతికించుకున్న మూడోసారి నాన్నను బ్రతికించుకోలేకపోయామని తెలిపారు. 2012 దివాళి తర్వాత ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ వచ్చింది. అయితే అప్పటికే తనకు లివర్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉందని వైద్యులు తెలియజేశారు. మరికొన్ని నెలల కంటే ఎక్కువ బ్రతకరని డాక్టర్ తెలియజేశారు.
ఇక నాన్నకు (Dharmavarapu Subramanyam) క్యాన్సర్ అని తెలియగానే బ్రహ్మానందం గారు తనని చూడటం కోసం మా ఇంటికి వస్తానని చెప్పగా నాన్న మాత్రం మా ఇంటికి రావద్దు నన్ను ఇలా చూస్తే నువ్వు తట్టుకోలేవు మరి కొద్ది రోజులలో నేనే వస్తా ఇద్దరం కలిసి సినిమాలు చేద్దామని చెప్పారు. అయితే 2013 డిసెంబర్ నెలలో నాన్న మరణించారు నాన్న మరణిస్తే బ్రహ్మానందం గారు మా ఇంటికి రాలేదు కానీ ఫిలిం ఛాంబర్ లో బాగా ఏడ్చారని రవి బ్రహ్మ తేజ తెలిపారు.