 
                                                        ‘క’ తో మంచి హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం గత వారం ‘దిల్ రూబా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అంటే మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి విశ్వ కరుణ్ దర్శకుడు. ‘శివమ్ సెల్యులాయిడ్స్’, ‘సారెగమ’ ‘ఏ యూడ్లీ’ సంస్థలపై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ‘క’ హిట్ అవ్వడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపినట్టు అయ్యింది.

మొదటి వీకెండ్ ను ఈ సినిమా ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 0.29 Cr | 
| సీడెడ్ | 0.15 Cr | 
| ఉత్తరాంధ్ర | 0.16 Cr | 
| ఈస్ట్ | 0.07 Cr | 
| వెస్ట్ | 0.04 Cr | 
| గుంటూరు | 0.07 Cr | 
| కృష్ణా | 0.11 Cr | 
| నెల్లూరు | 0.04 Cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.93 Cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 Cr | 
| వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) | 1.05 Cr (షేర్) | 
‘దిల్ రూబా’ చిత్రానికి రూ.8.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.1.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.95 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
