B Gopal: దర్శకుడు బి.గోపాల్ తో బాలయ్య సినిమా.. జరిగే పనేనా?
- August 22, 2024 / 06:00 PM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ (Balakrishna) , దర్శకుడు బి.గోపాల్ (B Gopal) ..లది హిట్టు కాంబినేషన్. ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్స్పెక్టర్’ ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వీరి కాంబినేషన్లో తెరకెక్కాయి. అయితే 2003 లో వచ్చిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ (Palnati Brahmanayudu) పెద్ద డిజాస్టర్ అయ్యింది.ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి లేని రోజుల్లోనే ఆ సినిమాపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా నుండే బాలయ్యని వరుస ప్లాపులు వెంటాడాయి. కొన్నాళ్ళు ఆయన ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేశాయి.
B Gopal

ముఖ్యంగా ఆ సినిమాలో ‘బాలకృష్ణ తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం’ వంటి సన్నివేశాలు ఎపిక్ ట్రోల్ మెటీరియల్. అసలు ఆ సన్నివేశాలు ఎలా చేశానో నాకే తెలీదు.. అంటూ బాలయ్య ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 21 ఏళ్ళ తర్వాత బాలయ్య- బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ మొన్నామధ్య వార్తలు వచ్చాయి. బుర్రా సాయి మాధవ్ కథ అందిస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది.

అయితే ఎందుకో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఆల్మోస్ట్ ఇక ఈ ప్రాజెక్టు ఉండదేమో అని అభిమానులు కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ‘ఇంద్ర’ (Indra) రీ రిలీజ్ సందర్భంగా బి.గోపాల్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన నెక్స్ట్ సినిమా బాలకృష్ణతోనే ఉంటుందని, రెండు స్క్రిప్ట్..లు అనుకున్నామని, కానీ బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) ఇంకో మంచి స్క్రిప్ట్ తీసుకొస్తాను బి.గోపాల్ కి చెప్పారట.

‘నాతో సినిమా చేయండి అంటే బాలకృష్ణ’ కాదనరని దర్శకుడు బి.గోపాల్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మరి ఆయన ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే బాలకృష్ణ.. బాబీ (Bobby) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక ఏ దర్శకుడితో సినిమా ఫైనల్ చేస్తారో చూడాలి.
మూడో ‘దృశ్యం’ కథ.. ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు జీతూ జోసెఫ్
B.Gopal : Balayya Cinemathone re- entry #Balakrishna #NandamuriBalaKrishna #NBK #NBK50YearsCelebrations #Indra4K #Indra @NBK_Unofficial @Mokshagna_Offl @TrendsMokshu pic.twitter.com/xou9VL8zxi
— Phani Kumar (@phanikumar2809) August 22, 2024

















