విజయ్ దేవరకొండ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఓ స్థాయి స్టార్ హీరో రేంజ్ పాపులారిటీని ఆయన కలిగివున్నాడు. అతని ఆట్టిట్యూడ్, మేనరిజం, డ్రెస్సింగ్ స్టైల్ కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే విజయ్ కి బయట కనిపిస్తున్న పాపులారిటీకి ఆయన సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కి సంబంధం ఉండటం లేదు. ప్లాప్ టాక్ వస్తే మినిమం వసూళ్లు కూడా ఆయన చిత్రాలు దక్కించుకోలేకపోతున్నాయి. తాజాగా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొదటి షో నుండే నెగెటివ్ టాక్ తో నడిచిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ కూడా ముగియకముందే బాక్సాఫీస్ వద్ద సందడి కోల్పోయింది. ప్రస్తుతానికి వరల్డ్ ఫేమస్ లవర్ గురించి యూత్ లో ఏమాత్రం చర్చ లేదు. కనీసం 30-40 శాతం పెట్టుబడి కూడా ఇంకా వసూలు కాని నేపథ్యంలో భారీ నష్టాలను ఈ చిత్రం మిగిల్చేలా కనిపిస్తుంది.
విజయ్ కి ప్రస్తుతం యూత్ లో ఉన్న పాపులారిటీ రీత్యా సినిమా టాక్ ఎలా ఉన్నా మినిమమ్ వసూళ్లు ఖాయం అనుకున్న నిర్మాతలకు వాస్తవ పరిస్థితులు మింగుడు పడడం లేదు. గీతగోవిందం బంపర్ హిట్ తరువాత ఆయన నటించిన నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది లేదు. ఒక్క టాక్సీవాలా మాత్రమే పెట్టుబడి రాబట్టిన చిత్రంగా ఉంది. వరల్డ్ ఫేమస్ లవర్ ప్రభావం విజయ్ నెక్స్ట్ మూవీ ఫైటర్ పై పడే అవకాశం కలదు. దర్శకుడు పూరి కూడా బడ్జెట్ విషయంలో హద్దులు పెట్టుకొనే అవకాశం కలదు. కారణం అది ఆయన సొంత బ్యానర్ లో తెరకెక్కుతుంది కాబట్టి. కనుక వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితం, విజయ్ దేవరకొండకు పెద్ద
దెబ్బే వేసింది.