‘జాతి రత్నాలు’ సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోయాడు అనుదీప్. ఆ తర్వాత చేసిన ‘ప్రిన్స్’ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. దీంతో అనుదీప్ కొంచెం రేసులో వెనుకబడ్డాడు.రవితేజతో చేయాల్సిన సినిమా ఒకటి పెండింగ్లో పడింది. చిరంజీవితో అనుకున్న సినిమా కూడా వెనక్కి వెళ్లినట్లు అయ్యింది. మొత్తానికి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి టాప్ బ్యానర్లో విశ్వక్ సేన్ వంటి క్రేజీ హీరోతో ‘ఫంకీ’ అనే సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
Funky Movie Teaser
‘ఫంకీ’ టీజర్ 1:48 నిమిషాల నిడివి కలిగి ఉంది. టీజర్ ఆరంభంలో ‘చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు వినలేదురా మనం’ అంటూ సీనియర్ నటి రజిత.. సీనియర్ నరేష్ తో పలుకుతుంది. ఆ వెంటనే పక్కన ఉన్న నటి ‘ఏం చెప్పారండీ మీ అమ్మగారూ’ అని అమాయకంగా అడిగితే.. ‘చెప్పాను కదా వినలేదు అని’ అంటూ కౌంటర్ విసురుతుంది రజిత’… ! ఇది అనుదీప్ మార్క్ రైటింగ్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆ తర్వాత హీరో విశ్వక్ సేన్ ఎంట్రీ ఇవ్వడం. అతను కూడా నాన్ స్టాప్ పంచులతో నవ్వించే ప్రయత్నం చేశాడు. సినిమాలో అతనొక దర్శకుడు. అయితే నిర్మాత కూతుర్ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో వచ్చే ఫన్ ఆసక్తికరంగా సాగుతుంది అని నిర్మాత నాగవంశీ ఇదివరకే రివీల్ చేశారు. టీజర్లో ఫన్ చాలా బాగుంది. భీమ్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించే విధంగా ఉంది. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి: