Gabbar Singh Collections: రీ- రిలీజ్ సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ‘గబ్బర్ సింగ్’
- September 3, 2024 / 05:10 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం.. నిన్న అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 4K లో రీ- రిలీజ్ అయ్యింది. భారీ వర్షాలు, వరదల్ని పట్టించుకోకుండా ప్రేక్షకులు.. మళ్ళీ ‘గబ్బర్ సింగ్’ ని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేసేందుకు థియేటర్లకు తరలి వెళ్లారు. దీంతో రీ రిలీజ్లో కూడా ‘గబ్బర్ సింగ్’ చిత్రం భారీ కలెక్షన్స్ ను సాధించి ఆల్ టైం రికార్డులు స్రుస్థించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కర్ణాటక, ఓవర్సీస్లలో కూడా భారీ కలెక్షన్స్ ను సాధించింది ‘గబ్బర్ సింగ్’.
Gabbar Singh Collections

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడం, ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించడం వంటి అంశాల వల్ల.. అభిమానులు, జనసేన శ్రేణులు అందరూ ‘గబ్బర్ సింగ్’ థియేటర్లలో పవన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అందువల్లే రీ రిలీజ్..లలో ‘మురారి’ (Murari) నెలకొల్పిన రికార్డులను సైతం బ్రేక్ చేసింది ‘గబ్బర్ సింగ్’. ఒకసారి ‘గబ్బర్ సింగ్’ రీ- రిలీజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 2.50 cr |
| సీడెడ్ | 0.41 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.60 cr |
| ఏపి+తెలంగాణ | 5.51 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.25 cr |
| ఓవర్సీస్ | 0.75 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 6.51 cr |
‘గబ్బర్ సింగ్’ (4K) రీ రిలీజ్ మొదటి రోజు రూ.6.51 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.టాలీవుడ్ రీ- రిలీజ్..లలో అత్యధిక గ్రాస్ ను కలెక్ట్ చేసిన సినిమా ఇదే. షేర్ పరంగా చూసుకుంటే రూ.4 కోట్ల వరకు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి.

















