టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer) మూవీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ (Shankar) దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో టీమ్ బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లోనూ అగ్రెసివ్‌గా అడుగులు వేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలతో మూవీ పైన ఆసక్తి మరింతగా పెరిగింది. ఇప్పటికే విడుదలైన రెండు మాస్ సాంగ్స్ అభిమానులను ఫుల్ గా ఆకట్టుకున్నాయి.
Game Changer
తాజాగా విడుదలైన ‘నానా హైరానా’ సాంగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లిరికల్ వీడియో రాకముందే హిట్ అయిన ఈ సాంగ్, ఇప్పుడు అన్ని మ్యూజిక్ చార్ట్‌లను దూసుకుపోతోంది. ఈ పాటకు అభిమానులు పెద్ద ఎత్తున స్పందించడంతో మిగతా పాటలపై హైప్ పెరిగింది. ఇదిలా ఉంటే, సినిమాలో కీలకమైన ఓ పాటను మేకర్స్ ఇప్పట్లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. రామ్ చరణ్, అంజలి (Anjali) పై చిత్రీకరించిన ఈ పాట ఫ్లాష్‌బ్యాక్ లో వస్తుందని సమాచారం.
ఫ్లాష్‌బ్యాక్ కథలో కీలకమైన ఈ సీన్, సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్లను దెబ్బతీయకుండా ఉండేందుకు, థియేటర్‌లోనే చూపించాలని చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంజలి పాత్ర కథానాయకుడి ఫ్లాష్‌బ్యాక్ లో కీలకంగా ఉంటుందన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. అయితే ఆమె పాటకు సంబంధించిన హైప్ నెట్టింట కొనసాగుతుండటంతో, థియేటర్‌లో దీన్ని ఎలా ప్రెజెంట్ చేస్తారన్న ఆసక్తి పెరుగుతోంది. ఈ పాటను టీజర్ లేదా ట్రైలర్ లో కూడా వదలకుండా సస్పెన్స్ కంటిన్యూ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి బరిలో భారీ పోటీలో విడుదల కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (S.S.Thaman) అందించిన బీజీఎమ్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మనసు దోచుకుంటే, మిగతా పాటలు సినిమాకు అదనపు బలంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అంజలి పాట సినిమా థియేటర్లలో ఎంతమేర ప్రభావం చూపిస్తుందో చూడాలి.