#SSMB28.. ఈ సినిమా గురించి చాలా రోజుల నుండి మాట్లాడుతున్నాం, ఇంకొన్నాళ్లు మాట్లాడుకుంటాం కూడా. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయం చెప్పేసినా.. ఎక్కడో చిన్న డౌట్ ఉంది. అయితే ఇప్పుడు మాటలు డేట్ కోసం కాదు.. మాటల కోసమే. అవును ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాలో మహేష్‌బాబు డైలాగ్‌లకు అంత పేరుంది. అలా అని అన్ని సినిమాల్లో ఒకేలా ఉండడు. అదే ఇక్కడ స్పెషల్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే గత రెండు సినిమాల్లో మహేష్ మాటలు అంతలా వావ్ అనిపించాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇప్పటివరకు రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. తొలుత ‘అతడు’ సినిమా చేశారు. రెండో సినిమాగా ‘ఖలేజా’ చేశారు. తొలి సినిమాలో మహేష్‌బాబు చాలా తక్కువగా మాట్లాడిన విషయం తెలిసిందే. డైలాగ్‌లు తక్కువగా ఉంటూ.. కేవలం ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇంకా బాడీ లాంగ్వేజ్‌తో అదరగొట్టాడు మహేష్. అందులో పాత్రకు తగ్గట్టుగా అలా ఆ క్యారెక్టర్ రూపొందించారు అనుకోవచ్చు. అప్పటికి మహేష్ ఫ్యాన్సకి అది కొత్తగా అనిపించింది.
ఇక రెండో సినిమా ‘ఖలేజా’ సినిమా దగ్గరకు వచ్చేసరికి.. మొత్తం మారిపోయింది. మహేష్ ఈ సినిమాలో చాలా యాక్టివ్‌గా కనిపించాడు. మహేష్ డిక్షన్, మాటలు అదిరిపోయాయి అని చెప్పొచ్చు. మహేష్‌ను అలా యాక్టివ్‌గా చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. అందులో మహేష్ టైమింగ్ ఇప్పటికీ హైలైట్ అని చెప్పాలి. అలాంటి మహేష్‌ను మళ్లీ ఆ తర్వాత ఇంకే సినిమాలోనూ చూడలేదు అని చెప్పాలి.
దీంతో ఇప్పుడు చేస్తున్న మూడో సినిమాకు సంబంధించి మహేష్ ఎలా కనిపిస్తాడు అనే చర్చ మొదలైంది. తొలి సినిమాలా కామ్‌గా ఉంటాడా, లేక రెండో సినిమాలోలా యాక్టివ్‌గా ఉంటాడా అనే చర్చ సాగుతోంది. అయితే సినిమా నేపథ్యంలో గుంటూరు, మిర్చీ యార్డ్ అంటున్నారు కాబట్టి.. యాక్టివ్‌గానే ఉంటాడు అని అనుకోవచ్చు. అయితే ‘ఖలేజా’ తరహాలో అంత యాక్టివ్‌గా ఉండడు అని అంటున్నారు.