సంక్రాంతికి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా వస్తే.. అది కచ్చితంగా హిట్టే అనే నమ్మకం నందమూరి అభిమానుల్లో ఉంది. బాలయ్య సంక్రాంతి ట్రాక్ రికార్డు కూడా బాగుంది. ‘సమరసింహారెడ్డి’ (Samarasimha Reddy) ‘నరసింహనాయుడు’ (Narasimha Naidu) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.అందుకే జనవరి 12 న రాబోతున్న ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ‘అఖండ’ (Akhanda) ‘వీరసింహారెడ్డి’ ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో బాలయ్య సూపర్ ఫామ్లో ఉన్నాడు.
Daaku Maharaaj
‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) ఫేమ్ బాబీ కొల్లి (Bobby) ఈ చిత్రానికి దర్శకుడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) నిర్మిస్తున్నారు. తమన్ (S.S.Thaman) సంగీతం దర్శకుడు. ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. అవి ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. బహుశా.. సినిమా రిలీజ్ అయ్యాక అవి.. ప్రేక్షకులకి ఎక్కొచ్చేమో… ప్రస్తుతానికైతే చెప్పలేం..! నిన్న ‘దబిడి దిబిడి’ అనే మాస్ లిరికల్ సాంగ్ ని(3వ పాట) వదిలారు. ఊర్వశి రౌతేలా (Urvashi Rautela), బాలకృష్ణ..ల డాన్స్ మూమెంట్స్ ఇందులో బాగున్నప్పటికీ.. సాంగ్ వినసొంపుగా లేదు.
సోషల్ మీడియాలో కూడా పెద్దగా చప్పుడు చేయడం లేదు. రిలీజ్ కి మరో 9 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి.. నెక్స్ట్ ఈ సినిమా నుండి వచ్చే ప్రమోషనల్ మెటీరియల్ కి యాసిడ్ టెస్ట్ అనే చెప్పాలి. అందుకే భారమంతా ట్రైలర్ పైనే వేశారు అభిమానులు..! అది కనుక ఆకట్టుకుంటే.. కచ్చితంగా బజ్ పెరుగుతుంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి పెద్ద సినిమాతో పోటీగా రిలీజ్ అవుతుంది కాబట్టి..
బజ్ పెరగడం చాలా ముఖ్యం. అప్పుడే భారీ ఓపెనింగ్స్ వచ్చి త్వరగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే బ్రేక్ ఈవెన్ కి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath) , హీరోయిన్ గా నటిస్తుంది. ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) , చాందినీ చౌదరి (Chandini Chowdary) ..లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.