పాపం అప్పటికే వరుసగా వచ్చిన ఫ్లాపుల పుణ్యమా అని కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాడు. అప్పుడెప్పుడో వచ్చిన “లౌక్యం” తర్వాత భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ కి సరైన హిట్ కాదు కదా కనీసం బ్రేక్ ఈవెన్ అయిన సినిమాలు కూడా లేవు. భారీ అంచనాల నడుమ విడుదలైన “పైసా వసూల్” కూడా డిజాస్టర్ అయ్యింది. మరి నిర్మాతగా కంటిన్యూ అవ్వడం కష్టం అనుకున్నాడో లేక రాజకీయాల్లోకి వెళితే పరపతి పెరుగుతుందనుకొన్నాడో తెలియదు కానీ.. సడన్ గా పోలిటికల్ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఏకంగా తెలుగుదేశం పార్టీ తరపున శేరిలింగంపల్లి నుంచి పోటీ చేశాడు కూడా. తెలంగాణలో టి.ఆర్.ఎస్ తాకిడి తట్టుకోలేక ఓడిపోయాడనుకోండి. అదే వేరే విషయం.
అయితే.. ఈ క్రమంలో పార్టీకి చేరడానికి కానీ టికెట్ సంపాదించడానికి కానీ.. పార్టీ ఫండ్ అనీ, ఎలక్షన్ కోసం బడ్జెట్ అనీ, ప్రమోషన్స్ అనీ, ప్రచారాలు అనీ దాదాపుగా 100 కోట్ల దాకా ఖర్చు పెట్టేశాడట. ఎలక్షన్స్ లో కొత్త అభ్యర్ధులు ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం అనేది ఎక్కడా జరిగి ఉండదు. కానీ.. గెలుస్తానన్న విపరీతమైన నమ్మకమే ఆయన చేత ఈరేంజ్ లో ఖర్చు పెట్టించింది. మరి ఈ నష్టం నుంచి ఆయన తేరుకొని మళ్ళీ సినిమా ఎప్పుడు మొదలెడతాడో చూడాలి.