2019 సంక్రాంతికి (Sankranti) నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu), రాంచరణ్ (Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) , వెంకటేష్ (Venkatesh) నటించిన ‘ఎఫ్ 2’ (F2 Movie) సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే డబ్బింగ్ సినిమా ‘పేట’ (Petta) కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో బాలయ్య నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రాంచరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ పెద్ద డిజాస్టర్ అయ్యాయి. ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘పేట’ అంతంత మాత్రంగా ఆడింది. చూస్తుంటే ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది అంటున్నారు నెటిజెన్లు.
Sankranti
ఎందుకంటే మళ్ళీ అదే హీరోల సినిమాలు 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. రాంచరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) , బాలకృష్ణ 109 వ సినిమా, వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమాలు 2025 సంక్రాంతికి వస్తున్నాయి. అదనంగా అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రావచ్చు. వీటిలో రాంచరణ్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ కి ‘వినయ విధేయ రామ’ హైప్ ఉంది. అలాగే బాలకృష్ణ .. బాబీతో (Bobby) చేస్తున్న సినిమాపై కూడా మంచి హైప్ ఉంది. కానీ ఈ సినిమాకి తగిన విధంగా ప్రమోషన్స్ చేయడం లేదు.
టైటిల్ కూడా ఇంకా రివీల్ చేయలేదు.అందువల్ల ఫలితం పై ప్రభావం చూపించవచ్చు. ఇక వెంకటేష్- అనిల్ రావిపూడి..ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ పై పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే.. రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ ‘గేమ్ ఛేంజర్’ లో కియారానే (Kiara Advani) హీరోయిన్ కావడం. వెంకటేష్ ‘ఎఫ్ 2’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలకు అనిల్ రావిపూడినే (Anil Ravipudi) డైరెక్టర్ కావడం. సో 2019 సంక్రాంతి లాగే ఈసారి కూడా వెంకటేష్ విన్నర్ గా నిలుస్తాడేమో చూడాలి. ఇక్కడ