‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari).. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ. గతేడాది అంటే 2023 , అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదలైంది. కాజల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela).. హీరో బాలకృష్ణకి కూతురు టైపు రోల్ చేసింది.వీరి కాంబినేషన్లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది..లు సంయుక్తంగా నిర్మించారు.
Bhagavanth Kesari
ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ చూడాల్సి వస్తుంది అనేది ఇన్సైడ్ టాక్. ‘అదేంటి? ‘భగవంత్ కేసరి’ ని మళ్ళీ రీ – రిలీజ్ చేస్తున్నారా?’ అనే డౌట్ మీకు రావచ్చు. కానీ విషయం అది కాదు..! ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని తమిళంలో విజయ్ తో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మమిత బైజు శ్రీలీల పాత్రలో,పూజ హెగ్డే కాజల్ పాత్రలో, అర్జున్ రాంపాల్ పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్టు టాక్ నడిచింది. అయితే చిత్ర బృందం నుండి దీనిపై రెస్పాన్స్ లేకపోవడంతో అది గాసిప్పేమో అని అంతా అనుకున్నారు.
కానీ అది నిజమే అని టాక్ బలంగా వినిపిస్తోంది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ని తమిళంలో విడుదల చేస్తున్న ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ సంస్థ ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. విజయ్ ఆఖరి చిత్రంగా ఇది రీమేక్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో మహిళలు స్వయం శక్తితో ఎదగాలనే అంశం ఉండటం, మంచి మెసేజ్ కూడా ఉండటంతో .. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి కూడా మైలేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందని.. ఈ కథను ఎంపిక చేసుకున్నారట. హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇంకో విషయం ఏంటంటే.. ‘తుపాకీ’ నుండి విజయ్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి.. ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేస్తారట. తెలుగులో కూడా విజయ్ కి ఫ్యాన్స్ ఉండటంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని మరో వెర్షన్లో తెలుగు ప్రేక్షకులు మళ్ళీ చూడాలన్న మాట.