‘లైగర్’ సినిమా మొదలైనప్పుడు… ఇదేంటి ‘అమ్మ నాన్న తమిళమ్మయి 2’నా అని అడిగారు కొంతమంది. కొన్ని రోజులపాటు సోషల్ మీడియాలో ఇదే పాయింట్ మీద డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ‘లైగర్’ అనే పేరు చెప్పేసరికి ఆ సినిమా ఇది కాదేమో అని వదిలేశారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కొత్త పుకార్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అంతేకాదు సినిమా టైటిల్ కింద పెట్టిన క్యాప్షన్‌కి రీజన్ కూడా తెలుస్తోంది.
‘లైగర్’లో విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎం) ప్లేయర్‌గా కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఈ విషయమే చూపించారు కూడా. ఈ సినిమాలో బాక్సంగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపిస్తాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అది నిజమని తేలింది కూడా. విజయ్‌కి కోచ్‌గా టైసన్ కనిపిస్తారని కూడా చెప్పారు. అయితే టైసన్ కేవలం కోచ్‌గా మాత్రమే కాదు, విజయ్‌కి తండ్రిగా కూడా కనిపిస్తాడని అంటున్నారు.
‘అమ్మ నాన్న తమిళమ్మాయి’ సినిమాలో ప్రకాశ్ రాజ్ లాంటి క్యారెక్టర్‌లో టైసన్ కనిపిస్తారని టాక్. ‘అమ్మ నాన్న..’లో తరహాలోనే ఇందులో కూడా హీరో తల్లిదండ్రులు ఓ కారణంతో విడిపోతారని, అనుకోని కారణాల వల్ల హీరోకు తన తండ్రి గురించి తెలుస్తుందట. ఈ క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన ఎంఎంలో హీరో ఎలా విజయం సాధించాడు. ఈ క్రమంలో కోచ్‌గా భావించే తన తండ్రిని ఎప్పుడు, ఎలా కలిశాడు అనేదే కథ అంటూ ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
ఒకవేళ ఈ రూమరే నిజమైతే.. ఈ సినిమా టైటిల్‌కి పెట్టిన క్యాప్షన్ ‘సాలా క్రాస్‌బ్రీడ్’ కారణం ఇదేనవ్వొచ్చు. అలాగే ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’ సీక్వెల్ అనే మాట కూడా నిజమవ్వొచ్చు. అయితే అందరూ ఊహించినట్లుగా సినిమాలు చేయడం పూరి జగన్నాథ్ స్టయిల్ కాదు. ఒకవేళ అలాంటి కథే తీసుకున్నా, తనదైన డైలాగ్స్, మేనరిజమ్స్, హీరోయిజమ్ ఎలిమెంట్స్‌తో సినిమాకు కొత్త లుక్ తీసుకొచ్చేస్తారు. విజయ్ దేవరకొండ యాటిట్యూట్ ఎలానూ ఉంటుంది. సో క్రాస్ బ్రీడ్ సంగతేంటో ఆగస్టు 25న తెలుస్తుంది.