తారక్ – కొరటాల శివ సినిమా.. టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఇదొకటి. అయితే ఆ వెయిటింగ్ విడుదల కోసం కాదు. సినిమా స్టార్టింగ్ కోసం. చాలా నెలల నుండి అదిగో, ఇదిగో అంటూ ఈ సినిమాను ప్రారంభాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తాజాగా చూస్తే.. నవంబరులోనూ సినిమా స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదంటున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. టాలీవుడ్ వర్గాల్లో తద్వారా సోషల్ మీడియాలో ఓ విషయం వినిపిస్తోంది. అదే ఈ సినిమా రిలీజ్ డేట్. ఛస్ ఊరుకోండి స్టార్టే అవ్వలేదు, అప్పుడే రిలీజ్ డేట్ ఏంటా అనుకుంటున్నారా? మాదీ అదే డౌట్.
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తర్వాత రామ్‌చరణ్ మరో సినిమా మొదలెట్టేశాడు. శంకర్ ‘ఇండియన్ 2’ పనుల్లోకి వెళ్లకపోయుంటే ఆ సినిమా చివరికొచ్చేది కూడా. అదే సినిమాలో నటించిన ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు సినిమా మొదలుపెట్టలేదు. దీంతో అభిమానులు గుర్రుగా ఉన్నారు. దీంతో సినిమా ఉందా? లేదా అనే ప్రశ్నను కూడా ట్రెండ్ చేశారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ఇదీ అంటూ చిన్న పుకారు టాలీవుడ్‌లో మొదలైంది. దాని బట్టి చూస్తే.. సినిమాను విజయదశమి తీసుకొస్తారని అర్థమవుతోంది. అంటే అక్టోబరులో అన్నమాట.
అయితే ప్రజెంట్ సిట్యువేషన్ చూస్తే.. సినిమా ఇంతవరకు మొదలవ్వలేదు. ఇప్పుడు టీమ్ లొకేషన్ల వేటలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంకా సినిమాలో మెయిన్ కాస్టింగ్ రెడీ అవ్వలేదట. క్రూ విషయంలో మాత్రం కాస్త బెటర్ అని అంటున్నారు. ఇలాంటి సమయంలో సిరిమా రిలీజ్ డేట్ గురించి పుకార్లు రావడం నవ్వుగానే ఉంటుంది. అయితే టీమ్ మాత్రం పక్కా ప్లానింగ్‌లో రంగంలోకి దిగాలని చూస్తోందట. అంటే బౌండెడ్ స్క్రిప్ట్, పక్కా రూట్ మ్యాప్స్‌తో షూట్ మొదలుపెట్టి అనుకున్న సమయానికి ముగించేస్తారట.
మొన్నీమధ్య వచ్చిన పుకార్ల ప్రకారం చూస్తే సినిమాను ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు అని తెలిసింది. ఆ లెక్కన సినిమాకు ఎనిమిది నెలల సమయమే ఉంటుంది. దీంతో ఆరు నెలల్లో సినిమా ముగించి.. మిగిలిన సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి. అగ్ర హీరో సినిమాకు ఈ టైమ్ బౌండింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ‘పుష్ప’ సమయంలో దర్శకుడు సుకుమార్ దీని వల్లే చాలా ఇబ్బంది పడ్డారనే విషయం తెలిసిందే. అయితే సినిమా హిట్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేదంటే చుట్టేశారు అనే మాట వచ్చేది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను అలా చుట్టేస్తే కష్టం. ఎందుకంటే కొరటాల మీద ‘ఆచార్య’ ముద్ర ఉంది.