ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మన దేశంలోని ప్రజలను కలచివేస్తుంది. ఈ ఘటన గురించి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే స్పందించి సహాయక చర్యలు అందించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ ఘటన గురించి స్పందించారు.
‘కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తారక్ కామెంట్లు చేశారు.
ఈ విధ్వంసకర ఘటన వల్ల ఎన్నో ఫ్యామిలీలు తమకు ప్రియమైన వాళ్లను కోల్పోయారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇలాంటి కష్ట కాలంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తారక్ పేర్కొన్నారు. ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనా స్థలంలో వేగంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. 1200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని సమాచారం అందుతోంది.
రైళ్లు వేగంగా ప్రయాణించడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తారక్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మాస్ ప్రేక్షకులు టార్గెట్ గా కొరటాల శివ ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా కొరటాల శివకు వరుస విజయాలు దక్కాలని ఆచార్య ఫ్లాప్ సెంటిమెంట్ ను కొరటాల శివ బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
(Jr NTR) తారక్ కు కొరటాల శివ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రశాంత్ నీల్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాల బడ్జెట్ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.
Heartfelt condolences to the families and their loved ones affected by the tragic train accident. My thoughts are with each and every person affected by this devastating incident. May strength and support surround them during this difficult time.