‘దేవర’ (Devara) సినిమాతో గతేడాది ఆఖరున వచ్చి అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు తారక్ (Jr NTR). సినిమాకు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ చెప్పారు. ఆ సినిమా అయిన వెంటనే తారక్ కొత్త సినిమా పనుల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు ఆ సినిమా కూడా అయిపోవచ్చింది. దీంతో కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తున్నారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో షూటింగ్ అని అంటున్నారు. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు తారక్.
Jr NTR
ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ సినిమా టీమ్ నుండి ఇప్పటివరకు రాలేదు. అయితే భారీ ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో తారక్ విలనీ చేస్తున్నాడని, నెగిటివ్ రోల్ అని, డ్యూయల్ రోల్ అనీ ఇలా ఏవేవో చెబుతున్నారు. అలా సినిమా షూటింగ్ కూడా లాస్ట్‌కి వచ్చిందని లేటెస్ట్ రూమర్. జనవరి రెండో వారానికి ఈ సినిమా షూటింగ్ పనులను ఎన్టీఆర్ పూర్తి చేసుకుంటాడట. దీంతో మూడో వారంలోనే కొత్త సినిమా పనులు ప్రారంభించాలని తారక్ అనుకుంటున్నాడట.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తారక్ ఓ సినిమా ఇప్పటికే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా మైత్రీ మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఆ సినిమా తొలి షెడ్యూల్ కర్ణాటకలో మొదలు కానుందని సమాచారం. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా కోసం అక్కడ భారీ సెట్స్ రూపొందిస్తున్నారట. కుందాపుర్ ప్రాంతంలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారట.
కుందాపుర్ అంటే రిషభ్ శెట్టి (Rishab Shetty) సొంత ప్రాంతం. అక్కడే ఈ ఏర్పాట్లు సాగుతున్నాయని టాక్. ఇక ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చేయని పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ఇప్పటికే ఆయన ప్రీలుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో తారక్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కనిపించే అవకాశముంది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పారు.