‘స్టూడెంట్ నెం.1’ సినిమా పేరు చెప్పగానే.. వెంటనే మన కళ్ల ముందు ఎన్టీఆర్ డ్యాన్స్, తారక్ డైలాగ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటన కదలాడతాయి. అంతలా ఆ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీ స్క్రీన్ల ముందు నిలిచిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంత కంటే ఎక్కువగా ఆ సినిమాలో ఎన్టీఆర్‌ను అభిమానిస్తుంటారు ఫ్యాన్స్. అయితే నిజానికి ఆ ప్లేస్ ప్రభాస్‌ను చూడాల్సింది తెలుసా? ఆ సరదాలన్నీ ప్రభాస్ ఫ్యాన్స్‌కి దక్కాల్సింది తెలుసా?
‘స్టూడెంట్ నెం.1’ తారక్ కెరీర్‌లో రెండో సినిమా. నిజానికి చెప్పాలంటే ఈ సినిమా విజయమే తారక్‌ను స్టార్ హీరో దిశగా మలిచింది అని చెప్పాలి. తొలి సినిమా ‘నిన్ను చూడాలని’ ఆశించిన మేర విజయం సాధించకపోవడంతో ఏంటిలా అయిపోయింది అని అనుకుంటున్న ఫ్యాన్స్‌కి ‘స్టూడెంట్ నెం.1’తో భలే ట్రీట్ ఇచ్చారు రాజమౌళి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందిన సినిమా ఇది. అయితే ఆ విజయం, ఊపు ప్రభాస్ ఫ్యాన్స్‌కి రావాలి అట.
‘స్టూడెంట్ నెం.1’ సినిమాను 2001లో నిర్మాత అశ్వనీదత్ అనుకున్నప్పుడు తొలుత ప్రభాస్‌ను హీరో అనుకున్నారట. అంటే ఆ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్‌కి పరిచమవ్వాలి. ఈ దిశగా చర్చలు సాగుతున్న సమయంలో అశ్వనీదత్‌కు హరికృష్ణ నుండి ఫోన్ వచ్చిందట. దీంతో అశ్వనీదత్ ఆలోచన మారిందట. ఆ తర్వాత ఆ సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందట. అలా ఆ సినిమాలో ప్రభాస్‌ను కాదని, ఎన్టీఆర్‌ను తీసుకున్నామని అశ్వనీదత్ చెప్పారు.
సినిమాలో హై ఆక్టేన్ యాక్షన్ సీన్స్ ఉంటాయి, భారీ డైలాగ్‌లు కూడా ఉంటాయి. జానపదం లుక్, భరతనాట్యం టచ్ లాంటివి కూడా ఉంటాయి. మరి ప్రభాస్ ఆ పాత్ర చేసి ఉంటే ఈ నాట్యం టచ్ ఉండేదా అంటే ఏమో అనే అనాలి. ఎందుకంటే తారక్‌కు క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రవేశం ఉంది. ఏదైతే ఏముంది మంచి సినిమా అయితే ప్రభాస్‌కి మిస్ అయ్యింది.