నందమూరి కళ్యాణ్ రామ్ …1989 లో వచ్చిన బాల గోపాలుడు చిత్రంతో చిల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం 2003 లో వచ్చిన తొలిచూపులోనే చిత్రంతో..! హీరోగా అతను 19 సినిమాల్లో నటించాడు. ఇందులో అతనొక్కడే, పటాస్, 118, బింబిసార వంటి చిత్రాలతో హిట్లు అందుకున్నాడు. ఇక అసాధ్యుడు, హరేరామ్, ఎం.ఎల్. ఎ వంటి చిత్రాలు యావరేజ్ గా ఆడాయి. అయితే అతను ఓ హిట్ కొట్టిన తర్వాత ఇంకో హిట్టు కొట్టిన సందర్భాలు లేవు.
ఈ విషయం పై కళ్యాణ్ రామ్ కూడా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన అమిగోస్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాన్ని నిలబెట్టాలి అని నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నానికి ఓ ప్రెస్ మీట్ పెట్టి.. తమ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్ బుకింగ్స్ నిన్నటికి డల్ గా ఉన్నప్పటికీ ఈరోజు పికప్ అయినట్టు నిర్మాతలు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో హీరో కళ్యాణ్ రామ్ కూడా పాల్గొని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు పూర్తి కవస్తుందని. హిట్ కొట్టి సంతోషించిన ప్రతీసారీ నెక్స్ట్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తనను డిజప్పాయింట్.. చేసినట్టు చెప్పుకొచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడితే ఓ ఎనర్జీ వస్తుందని..
బింబిసార తర్వాత అమిగోస్ రూపంలో ఆ ముచ్చట తీరిందని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. మరి కళ్యాణ్ రామ్ గురించి అయినా అమిగోస్ బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో చూడాలి …!