నిన్నటి తరం నటి పూనమ్ ధిల్లాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో ఆమె విక్రమ్ కుమార్ (Vikram kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్టం’ లో (Ishtam) నటించారు. అలాగే ఆమె కమల్ హాసన్ తో (Kamal Haasan) కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ టైమ్లో కమల్.. ఈమెకు వార్నింగ్ ఇచ్చారట. ఆ విషయాన్ని పూనమ్ ధిల్లాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..”గతంలో ఒకసారి కమలహాసన్ తో ఒక సినిమా చేస్తున్న టైమ్లో… షూటింగ్ కు ఆలస్యంగా వెళ్లాను.
నాకంటే ముందే కమల్ హాసన్ సెట్స్ వచ్చారు. నేను ఆలస్యంగా రావడం చూసి.. ఆయన నాపై సీరియస్ అయ్యారు. వాస్తవానికి బాలీవుడ్లో గంట లేట్ గా వెళ్లినా ఎవరూ ఏమీ అనరు. అందుకే నేను కమల్ సినిమాకు కూడా గంట ఆలస్యంగా వెళ్లాను. అయితే కమల్ నా వద్దకు వచ్చి.. ‘ఎందుకు ఆలస్యమైంది?కెమెరా బాయ్స్, లైట్ బాయ్స్ అంతా ఉదయం 5 గంటలకే వచ్చారు. వాళ్లంతా నీ కోసం గంట నుండి ఎదురు చూస్తున్నారు.
వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించు’ అంటూ ఆయన మందలించారు. ఆ తర్వాత నాకు నా తప్పు తెలిసొచ్చింది. అప్పటి నుండి షూటింగ్ కి ఆలస్యంగా వెళ్ళింది అంటూ లేదు” అంటూ చెప్పుకొచ్చారు పూనమ్ ధిల్లాన్. కమల్ హాసన్ బయట ఎంత సరదాగా ఉన్న పని విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు. ఆయన టైమ్ కి అన్నీ అయిపోవాలి అనుకునే మనస్తత్వం.