‘కల్కి’ ని (Kalki 2898 AD) నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఎలా తీర్చిదిద్దాడో తెలీదు. కానీ ప్రభాస్ తో (Prabhas) పాటు అమితాబ్ (Amitabh Bachchan), కమల్ (Kamal Haasan) వంటి స్టార్స్ ని కూడా ఇందులో భాగం చేశాడు. అదే ఈ ప్రాజెక్టు విషయంలో అతను సాధించిన మొదటి సక్సెస్ గా చెప్పుకోవాలి. ఇద్దరు లెజెండ్స్ ని ఓ ప్రాజెక్టులో భాగం చేయడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా కేవలం 2 సినిమాలు మాత్రమే అనుభవం కలిగిన నాగ్ అశ్విన్ వంటి దర్శకులకి.
అయినా ఆ ఫీట్ సాధించాడు అంటే అతను గ్రేట్ అనే చెప్పుకోవాలి. అందుకే కమల్ హాసన్ కూడా ఏకంగా బాలచందర్ వంటి లెజెండరీ దర్శకుడితో పోల్చి ప్రశంసించాడు. ఈరోజు ముంబైలో జరిగిన ‘కల్కి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది . కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాగ్ అశ్విన్ మా గురువు గారు బాలచందర్ (K Balachander) గారిలా ఆర్డినరీగా కనిపించే ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్.
పైకి సాధారణంగా కనిపించే వారంతా అసాధారణమైన పనులు చేస్తుంటారు. నాగ్ అశ్విన్ తో కాసేపు మాట్లాడగానే అతని టాలెంట్ ఏంటనేది తెలిసిపోతుంది. తన ఐడియాని అద్భుతంగా ప్రజెంట్ చేసే నేర్పు నాగ్ అశ్విన్ కి ఉంది. ఇందులో బ్యాడ్ మ్యాన్ గా కనిపిస్తాను. ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. నా పాత్రని నాగ్ అశ్విన్ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశారు.
నా ఫస్ట్ లుక్ చూసి సర్ ప్రైజ్ అయినట్లే సినిమా చూసి కూడా చాలా సర్ ప్రైజ్ అవుతారు. నా లుక్ కోసం చాలా రీసెర్చ్ చేశాం. ఆడియన్స్ నా పాత్రని ఎలా రిసీవ్ చేసుకుంటారా? అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.